హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్లకు త్వరలో స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌.. ఈ లేటెస్ట్‌ స్పెసిఫికేషన్ బెనిఫిట్స్‌ ఇవే..

WhatsApp: వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్లకు త్వరలో స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌.. ఈ లేటెస్ట్‌ స్పెసిఫికేషన్ బెనిఫిట్స్‌ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్ ఇప్పుడు స్క్రీన్ లాక్ ఫీచర్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా యూజర్‌ వాట్సాప్‌ అప్లికేషన్‌ను ఓపెన్‌ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఇది వాట్సాప్‌కు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను అందిస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WhatsApp: వినియోగదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌(WhatsApp) కృషి చేస్తోంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇప్పుడు స్క్రీన్ లాక్ ఫీచర్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా యూజర్‌ వాట్సాప్‌ అప్లికేషన్‌ను ఓపెన్‌ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఇది వాట్సాప్‌కు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను అందిస్తుంది. యూజర్‌ తన డివైజ్‌లో కాకుండా మరో డివైజ్‌లో వాట్సాప్‌ వినియోగిస్తున్నప్పుడు అనధికారిక యాక్సెస్‌ నుంచి లాక్‌ ఫీచర్‌ భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యూజర్లకు స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌ అందించే పనిలో ఉన్నట్లు వాట్సాప్ ట్రాకర్ WaBetaInfo స్పష్టం చేసింది. త్వరలోనే బీటా టెస్టెర్స్‌కు దీన్ని లాంచ్‌ చేయవచ్చని పేర్కొంది.

 స్క్రీన్‌లాక్‌ ఫీచర్‌ ప్రయోజనాలు

వాట్సాప్‌లో స్క్రీన్ లాక్ ఫీచర్‌ ఆప్షనల్‌ అని WaBetaInfo తెలిపింది. యాప్‌కు పాస్‌వర్డ్ ఎప్పుడు అవసరమో వినియోగదారులు సెలక్ట్‌ చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిద్వారా వాట్సాప్‌పై చాట్‌లపై యూజర్‌లకు మరింత నియంత్రణ ఉంటుందని చెప్పింది. వినియోగదారు సెట్ చేసిన పాస్‌వర్డ్‌ను వాట్సాప్‌ కంపెనీ షేర్‌ చేయదని, ఈ పాస్‌వర్డ్‌ యూజర్‌ డివైజ్‌లోనే లోకల్‌గా స్టోర్‌ అవుతుందని వివరించింది. న్యూమరిక్‌ పాస్‌వర్డ్‌తో పాటు వినియోగదారులు తమ చాట్‌లకు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో కూడా భద్రత కల్పించవచ్చు. ఈ ఫింగర్‌ప్రింట్‌ తరహాలోనే Macలో టచ్ IDని ఉపయోగించి యాప్‌ను లాక్ చేసే సదుపాయాన్ని కూడా వాట్సాప్‌ కల్పించే సూచనలు ఉన్నాయని WaBetaInfo తెలిపింది. స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉన్నందున పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదని చెప్పింది.

Samsung: శామ్‌సంగ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్​..అతి త్వరలో అన్ని డివైజ్‌లకు ఆండ్రాయిడ్ 14 అప్‌​డేట్​

 స్క్రీన్ లాక్ పాస్‌వర్డ్‌ మర్చిపోతే?

వినియోగదారులు సెట్ చేసిన పాస్‌వర్డ్‌ను మరచిపోతే వాట్సాప్ డెస్క్‌టాప్ నుంచి లాగ్ అవుట్ చేసి, మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందని WaBetaInfo నివేదిక సూచిస్తోంది. పాస్‌వర్డ్‌ను మరచిపోతే, యాప్ నుంచి లాగ్ అవుట్ చేసి, డివైజ్‌ను QR కోడ్‌తో లింక్ చేయడం ద్వారా మళ్లీ వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లోకి లాగిన్ అవ్వాలని పేర్కొంది.

 అందుబాటులోకి వచ్చిన పోల్‌ ఫీచర్‌

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇటీవల క్రియేట్ పోల్ ఫీచర్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌(Android), ఐఫోన్‌(iPhone) రెండింటికీ పని చేస్తుంది. ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు ఈ ఫీచర్ కేవలం గ్రూప్‌లలో పోల్స్‌ క్రియేట్‌ చేయడానికి మాత్రమే వినియోగదారులను అనుమతించేది. అయితే ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులు దీన్ని వ్యక్తిగత చాట్‌లలో కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉంది.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు