Home /News /technology /

WHATSAPP LAUNCHES NEW FEATURE FLASH CALLS AND MESSAGE LEVEL REPORTING OPTIONS FOR INDIAN USERS PRV GH

WhatsApp: వాట్సాప్‌లో మరో రెండు కొత్త సేఫ్టీ ఫీచర్లు.. భారత్‌లో ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఆప్షన్ల విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) వరుసగా అద్దిరిపోయే ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ రెండు ప్రైవసీ ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) వరుసగా అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ రెండు ప్రైవసీ ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఫ్లాష్ కాల్స్ (flash calls), మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ (message level reporting)పేర్లతో రెండు సరికొత్త ఫీచర్ల (new features)ను వాట్సాప్ పరిచయం చేసింది. ఈ రెండు ఫీచర్లు కూడా భారతదేశంలోని యూజర్ల ప్రైవసీ (users privacy)కి రక్షాకవచంలా ఉపయోగపడనున్నాయి. యూజర్లు మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ (Message level feature) ఫీచర్ సాయంతో ఏదైనా ఓ నిర్దిష్ట మెసేజ్‌ని ఫ్లాగ్ చేసి అకౌంట్లను రిపోర్ట్ (report accounts) చేయవచ్చు. అయితే వాట్సాప్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎస్ఎంఎస్ వెరిఫికేషన్‌కు అదనపు ఫీచర్‌గా ఫ్లాష్ కాల్ ఫీచర్ (flash call feature) యాడ్ అయింది. యూజర్ల ప్రైవసీ (users privacy)ని నిర్ధారించడం కోసమే ఈ రెండు సేఫ్టీ ఫీచర్స్ (safety features) ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ చెబుతోంది.

* ఫ్లాష్ కాల్ ఫీచర్

సాధారణంగా మనం కొత్త మొబైల్ ఫోన్ లో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (registration process) లో భాగంగా ఒక వెరిఫికేషన్ కోడ్ (Verification code) ఎస్ఎంఎస్ రూపంలో మన నంబర్‌కు అందుతుంది. అయితే దీనివల్ల ప్రైవసీ (privacy)కి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఫ్లాష్ కాల్ ఫీచర్‌ (flash call feature)ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్లాష్ కాల్ రూపంలో వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఫలితంగా ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదు.

వాట్సాప్ నంబర్ వెరిఫికేషన్‌ను ఎస్ఎంఎస్ (SMS) కి బదులుగా ఆటోమేటెడ్ కాల్‌ (Automated call)తో కంప్లీట్ చేసే ఆప్షన్‌ను ఫ్లాష్ కాల్ ఫీచర్ (flash calls) ద్వారా అందిస్తున్నామని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్‌ (feature)తో ఎలాంటి ఇతర ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ అవసరం ఉండదు. పూర్తి వెరిఫికేషన్ ప్రాసెస్ వాట్సాప్ అప్లికేషన్ లోనే జరిగిపోతుంది. ఫలితంగా వెరిఫికేషన్ కోడ్ ను యాక్సెస్ చేసే వీలు ఎవరికీ లభించదు.

* మెసేజ్ లెవల్ రిపోర్టింగ్

అసభ్యకర, హానికరమైన మెసేజ్‌లు పంపితే వాటిని వెంటనే రిపోర్ట్ చేసే వీలును మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ ఫీచర్ కల్పిస్తుంది. ఇతర యూజర్లను రిపోర్ట్ లేదా బ్లాక్ చేయడానికి నిర్దిష్ట మెసేజ్ ను లాంగ్ ప్రెస్ (Long Press) చేస్తే సరిపోతుంది. వాట్సాప్ కేవలం సెప్టెంబర్ నెలలోనే 2.2 మిలియన్లకు పైగా ఖాతాలను బ్యాన్ చేసింది. యూజర్లు రిపోర్ట్ చేసే ఖాతాలను ట్రేస్ చేయడానికి వాట్సాప్ ఆటోమేటెడ్ టూల్స్ (Automated tools) ఉపయోగించి వాటి సహాయంతోనే బ్యాన్ చేస్తుంది.

యూజర్ల ప్రైవసీ (Users privacy)కి పెద్దపీట వేసే వాట్సాప్ ఇప్పటికే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End to end encryption), కాంటాక్ట్ బ్లాకింగ్, షేరింగ్ కంట్రోల్, డిస్అప్పియరింగ్ మెసేజెస్ (disappearing messages), టచ్ ఐడీ లేదా పేస్ ఐడీతో లాక్ చేయడం వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. తాజా ఫీచర్లతో వాట్సాప్ మరింత సురక్షితం అయ్యింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: New feature, Security, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు