Home /News /technology /

WHATSAPP LATEST UPDATE ON FLASH CALLS AS AUTOMATIC VERIFICATION UMG GH

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక అంతా ఆటోమేటిక్ ప్రాసెసే..!

వాట్సాప్ కాల్

వాట్సాప్ కాల్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఫ్లాష్ కాల్స్ (Flash Calls) అనే మరొక అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ రిలీజ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఫ్లాష్ కాల్స్ (Flash Calls) అనే మరొక అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ యాప్ వెర్షన్ వాడే యూజర్లకు ప్రత్యామ్నాయ అథెంటికేషన్ (Authentication) ప్రాసెస్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో లాగిన్ కావాలంటే యూజర్లు తమ ఫోన్ నంబర్‌కి వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్లాష్ కాల్స్‌ అనే కొత్త వెరిఫికేషన్ మెథడ్ లేదా అథెంటికేషన్ స్టాండర్డ్‌తో 6-అంకెల కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయకుండానే వాట్సాప్‌కి లాగిన్ అవ్వొచ్చు. అంటే ఫ్లాష్ కాల్స్‌ ఫీచర్‌తో లాగిన్ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో 'ఫ్లాష్ కాల్స్' ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేస్తోంది. ఈ ఉపయోగకరమైన ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ఫ్లాష్ కాల్స్ అంటే ఫీచర్ ఏంటి?
ఫ్లాష్ కాల్స్ ఫీచర్ ఎస్ఎంఎస్‌ (SMS) లేదా కాల్ ద్వారా యూజర్‌ల ఫోన్ నంబర్‌కు అందే ఆరు-అంకెల OTPని ఉపయోగించకుండా వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ చేసే ఒక కొత్త ఆటోమేటిక్ అథెంటికేషన్ ప్రాసెస్. ఇప్పటికే ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్ యాప్‌లో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? 


* ఫ్లాష్ కాల్స్ ఎలా పని చేస్తాయి?
లాగిన్ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా పూర్తి కావాలంటే యూజర్లు ఫ్లాష్ కాల్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆపై వాట్సాప్ యూజర్లు ఆరు అంకెల OTPని మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆటోమేటిక్‌ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో యూజర్లకు వాట్సాప్ ఒక మిస్డ్ కాల్ లాంటి షార్ట్ కాల్‌ని చేస్తుంది. ఆ కాల్‌ని ఉపయోగించే యూజర్ల అకౌంట్‌ను వాట్సాప్ అథెంటికేట్‌ చేస్తుంది. దీని కోసం, యాప్ యూజర్ల లొకేషన్, SMS, కాల్ హిస్టరీని వాట్సాప్ యాక్సెస్ చేస్తుంది. అందుకే యూజర్లు వాట్సాప్ యాప్‌కు తమ కాల్ లాగ్స్ (Call Logs)తో పాటు అవసరమైన వాటికి యాక్సెస్ అందించాలి.


యూజర్లకు కాల్ చేసే ఫోన్ నంబర్ ఎల్లప్పుడూ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా సురక్షితమని వాట్సాప్ చెబుతోంది. వివిధ వాట్సాప్ అకౌంట్లలో లాగిన్ చేయడానికి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయడం సాధ్యం కాదు. అలానే వాట్సాప్ యూజర్ల కాల్ హిస్టరీ డేటాను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించదు. ఈ ఫీచర్‌ను మరే ఇతర పరిస్థితులలో కూడా వాట్సాప్ వాడదు. వెరిఫికేషన్ కోడ్ ఫోన్‌ స్క్రీన్‌పై కనిపించకుండానే ఫ్లాష్ కాల్స్ ఫీచర్ లాగిన్ ప్రాసెస్ పూర్తి చేస్తుంది కాబట్టి సెక్యూరిటీ రిస్క్‌లు తగ్గుతాయి.
Published by:Mahesh
First published:

Tags: Group call, New features, Tech news, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు