news18-telugu
Updated: April 18, 2019, 3:39 PM IST
WhatsApp is working on Animated Stickers, Rollout may soon | WhatsApp: వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్... త్వరలో
(image: REUTERS)
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్ రానున్నాయి. వాస్తవానికి యూజర్లకు స్టిక్కర్స్‌ని చాలా ఆలస్యంగా అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. అప్పటికే మెసెంజర్లాంటి అనేక యాప్స్‌లో స్టిక్కర్స్ ఉన్నాయి. కాస్త ఆలస్యంగా వచ్చినా వాట్సప్ స్టిక్కర్స్ యూజర్స్‌ని ఆకట్టుకున్నాయి. ప్లేస్టోర్‌లో వేర్వేరు డెలవపర్స్ నుంచి క్రియేటీవ్ స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసి వాట్సప్‌లో ఉపయోగిస్తున్నారు యూజర్లు. ఇక యానిమేటెడ్ స్టిక్కర్స్ వస్తే యూజర్లు మరింత క్రియేటీవ్‌గా స్టిక్కర్స్ షేర్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్ ఇలాగే ఉంటుంది.
via GIPHY
వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ప్రపంచానికి తెలిపే WABetaInfo ఈ విషయాన్ని వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో మాత్రమే కాదు... వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో కూడా యానిమేటెడ్ స్టిక్కర్స్ రానున్నాయి. ఇంకొన్ని రోజుల్లో వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్ కనిపిస్తాయని అంచనా. గిఫ్ ఫైల్ కన్నా యానిమేటెడ్ స్టిక్కర్ కాస్త భిన్నంగా ఉంటుంది. గిఫ్ ఫైల్ కొన్ని సెకన్లు మాత్రమే ప్లే అయితే యానిమేటెడ్ స్టిక్కర్ నాన్‌స్టాప్‌గా ప్లే అవుతూ ఉంటుంది. థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
ఇవి కూడా చదవండి:
Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
First published:
April 18, 2019, 3:17 PM IST