హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి!

WhatsApp: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వినియోగదారులు ఒకరితో ఒకరు మరింత సౌకర్యవంతంగా, సురక్షితమైన విధంగా కమ్యూనికేట్ చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కమ్యూనిటీ, ఫార్వార్డ్‌ మీడియా విత్‌ క్యాప్షన్స్‌, మెసేజ్‌ యువర్‌సెల్ఫ్‌ వంటి ఫీచర్‌లను అందించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వాట్సాప్‌ (WhatsApp) కొత్త ఫీచర్‌ల పరంపర కొనసాగుతోంది. మెటా(META) యాజమాన్యంలో వాట్సాప్‌ యూజర్లకు వరుస అప్‌డేట్‌లు అందిస్తోంది. వినియోగదారులు ఒకరితో ఒకరు మరింత సౌకర్యవంతంగా, సురక్షితమైన విధంగా కమ్యూనికేట్ చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కమ్యూనిటీ, ఫార్వార్డ్‌ మీడియా విత్‌ క్యాప్షన్స్‌, మెసేజ్‌ యువర్‌సెల్ఫ్‌ వంటి ఫీచర్‌లను అందించింది. వాట్సాప్‌ను సురక్షితమైన, యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫారంగా మార్చేందుకు కృషి చేస్తోంది. యూజర్‌ ఇంటర్‌ఫేస్, ప్రైవసీ కోసం అదనపు ఫీచర్లను అందిస్తోంది.

వీటిలో కొన్ని ఫీచర్లు బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో PIP మోడ్ (పిక్చర్-ఇన్-పిక్చర్), షేర్‌ చేసేముందు ఇమేజ్‌ క్వాలిటీ కాన్ఫిగర్ చేయడం, రిపోర్ట్‌ స్టేటస్‌ వంటివి ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్‌మెంట్‌ గ్రూప్‌లో యూజర్స్‌ రియాక్ట్‌ అయ్యే సదుపాయం అందించే ప్రయత్నాల్లో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

* కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్‌ గ్రూప్‌కు కొత్త ఫీచర్‌

WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్‌ కంపెనీ కొత్త ఫీచర్‌ను అనౌన్స్‌మెంట్‌ గ్రూప్‌లో ఇంటిగ్రేట్‌ చేసే యోచనలో ఉంది. యాప్ స్టోర్ నుంచి iOS యూజర్లు వాట్సాప్‌ ఇటీవలి అప్‌డేట్ (వెర్షన్ 23.2.0.75)ను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఈ ఫీచర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే అవకాశం ఉంది. అదే విధంగా బీటా టెస్టర్‌లకు TestFlight యాప్‌ ద్వారా అందుబాటులో ఉంది. అనౌన్స్‌మెంట్‌ గ్రూప్‌లో మెసేజ్‌ రియాక్షన్స్‌కి సంబంధించిన అప్‌డేట్ అందుబాటులో ఉన్నప్పుడు వినియోగదారులకు తెలియజేయడానికి వాట్సాప్‌ ఇన్-యాప్ బ్యానర్‌పై ప్లాన్‌ చేస్తోంది. iOS అప్లికేషన్‌లో ఈ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* టెక్స్ట్‌ అలైన్‌ చేసే సదుపాయం

ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ డ్రాయింగ్ టూల్‌ కోసం రీవ్యాంప్డ్‌ టెక్స్ట్ ఎడిటర్‌పై కూడా పని చేస్తోంది. ఇది టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడం, ఫాంట్‌లు ఛేంజ్‌ చేయడం, టెక్స్ట్ అలైన్‌మెంట్‌లో ఫ్లెక్సిబిలిటీ వంటి కొత్త ఫీచర్‌లను అందించనుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్ అలైన్‌మెంట్‌ చేయగలరు. ఇమేజ్‌కు తగిన విధంగా టెక్స్ట్‌ను అలైన్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది.

* ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్‌

వాట్సాప్‌ కొన్ని బీటా టెస్టర్ల కోసం కొత్త కెమెరాను కూడా విడుదల చేస్తోంది. కెమెరా మోడ్‌లోని కొత్త హ్యాండ్స్-ఫ్రీ ఫీచర్ కేవలం ఒక ట్యాప్‌తో వీడియోను రికార్డ్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. కేవలం ఒక ట్యాప్‌తో వీడియో మోడ్‌కి మారే సదుపాయంతో వాట్సాప్‌ కెమెరాను రీడిజైన్ చేసినట్లు పేర్కొంది. వీడియోలను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోవాల్సిన ట్యాప్‌ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి : Windows Update: విండోస్ 11 ఓల్డ్‌ వెర్షన్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌.. ఫుల్‌ డీటైల్స్‌ ఇలా..

ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్ వీడియోలను క్యాప్చర్ చేయడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ కెమెరాకు సులువుగా ఛేంజ్‌ కావచ్చని చెప్పింది. కొంతమంది బీటా టెస్టర్లు ఇప్పటికే కొత్త కెమెరా మోడ్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేశారని, లేటెస్ట్‌ అప్‌డేట్ ఇన్‌స్టాల్‌ చేసిన అందరికీ అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ అప్‌డేట్‌లో మునుపటి 2.23.2 బీటా బిల్డ్‌లోని బగ్ ఫిక్సెస్‌, పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఉన్నాయని తెలిపింది.

First published:

Tags: New feature, Tech news, Whatsapp

ఉత్తమ కథలు