Home /News /technology /

WHATSAPP IS WORKING ON A NEW FEATURE THAT WILL SIMPLIFY THE PROCESS OF RECORDING AUDIO MESSAGES GH SSR

WhatsApp New Feature: కొత్త ఫీచ‌ర్‌ను తీసుకురానున్న వాట్సాప్... ఇకపై మరింత సులభంగా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మెసేంజిగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరొక నూతన ఫీచ‌ర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. వాయిస్‌ మెసేజ్‌ల రికార్డింగ్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్ ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను డెవలప్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేంజిగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరొక నూతన ఫీచ‌ర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. వాయిస్‌ మెసేజ్‌ల రికార్డింగ్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్ ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచ‌ర్‌తో ఆడియో మెసేజ్‌ల రికార్డింగ్ ప్రాసెస్ సులభతరం కానుంది.

ప్రస్తుతం వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ పంపించాలంటే.. ఒకే ప్రయత్నంలో కంటిన్యూస్‌గా వాయిస్ రికార్డ్ చేయాల్సి వస్తోంది. రికార్డింగ్ సమయంలో ఏదైనా మిస్టేక్ వస్తే.. మళ్లీ ఫస్ట్ నుంచి రికార్డు చేయాల్సి వస్తోంది. కానీ రానున్న రోజుల్లో వాట్సాప్ యూజర్లు వాయిస్ రికార్డింగ్‌ను అప్రూవ్ (approve) చేయొచ్చు లేదా పూర్తిగా రీ-రికార్డ్ చేయవచ్చు. ఇప్పటిలాగా వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌ను మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రికార్డు చేయాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం యూజర్లు సులభంగా ఆడియో మెసేజ్ లను పంపించడానికి వీలుగా నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది వాట్సాప్‌. దీంతో యూజర్లు ప్రతిసారీ కొత్తగా వాయిస్ రికార్డు చేసే పని తప్పుతుంది. కొత్త ఫీచర్ ఒకే ఆడియో నోట్‌లోనే స్టార్ట్, స్టాప్, తిరిగి ప్రారంభించు(resume) అనే మూడు సరికొత్త ఆప్షన్స్ అందిస్తుంది. వీటి సాయంతో కాసేపు రికార్డు చేసి.. స్టాప్ చేసి.. మళ్లీ దానిని పునఃప్రారంభించొచ్చు.

ఇలాంటి ఆప్షన్స్ స్మార్ట్‌ఫోన్‌లలోని చాలా వాయిస్ రికార్డర్లు కలిగి ఉంటాయి. అదే తరహాలో వాట్సాప్ ఆడియో రికార్డింగ్ ఫీచర్ కూడా పని చేయనుంది. అన్ని కొత్త వాట్సాప్ ఫీచర్స్ గురించి తెలియజేసే WABetaInfo వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సరికొత్త ఫీచర్ తాజాగా ఐఓఎస్ బీటా వెర్షన్‌లో కనిపించింది. ఇలాంటి ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం వాట్సాప్ పనిచేస్తోందని నివేదిక పేర్కొంది.

కొత్త ఆడియో రికార్డింగ్ ఫీచర్ పనితీరుకు సంబంధించిన వీడియోని డబ్ల్యుబీఐ (WBI) అనే ఓ యూట్యూబ్‌ ఛానల్ షేర్ చేసింది. ఈ వీడియోలో యూజర్ రికార్డింగ్‌ను పాజ్ చేసి, ఆపై అవసరమైనప్పుడు దాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన ఓ ఆప్షన్ ఉన్నట్లు కనిపించింది. ఈ వీడియోలో వాట్సాప్ ఆడియో రికార్డింగ్ గ్రాఫిక్ కింద మూడు వేర్వేరు బటన్లను అందించినట్లు మనం చూడవచ్చు. రెడ్ ఐకాన్ పై క్లిక్ చేసి యూజర్ ఆడియో మెసేజ్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించవచ్చు. అలాగే అదే ఐకాన్ పై నొక్కి రికార్డింగ్ నిలిపివేయవచ్చు.

ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంత అమాయకంగా కనిపిస్తున్న నీలో ఇంత కర్కశమా.. ఇప్పుడు చూడు ఏమైందో..

రికార్డింగ్ పూర్తయిన తర్వాత యూజర్ తమ మెసేజ్ పంపించడానికి వీలుగా పక్కనే ఓ సెండ్ బటన్ అందించినట్లు కూడా గమనించవచ్చు. ఇటీవలే వాట్సాప్ చాట్ బ్యాకప్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ని బీటా టెస్టర్ల కోసం విడుదల చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.21.21.5 వెర్షన్, ఐఓఎస్ బీటా 2.21.200.14 అప్‌డేట్‌లో అందుబాటులో ఉంది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Latest Technology, Tech, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు