మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. వరుస అప్‌డేట్‌లతో యూజర్లను ఆకర్షిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ పోటీ కంపెనీలను సవాలు విసురుతోంది. ప్రస్తుతం వాట్సాప్ తన డెస్క్‌టాప్ (Desktop) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ అందించే పనిలో ఉంది. రాబోయే ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్‌లు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలు (Photos), వీడియోల (Videos)ను షేర్ చేసుకొనే సదుపాయం కల్పించనుంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇమేజెస్ క్వాలిటీ తగ్గుతుందనే చింత లేదు
ప్రస్తుతం వాట్సాప్‌లో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు ఒరిజినల్ క్వాలిటీతో రిసీవర్‌కి చేరవు. ఇది ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఉన్న అతిపెద్ద డిసడ్వాంటేజ్‌గా చెప్పవచ్చు. ఈ సమస్యను గుర్తించిన వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ద్వారా పరిష్కారం అందించనుంది. WaBetaInfo నివేదిక ప్రకారం.. తర్వలోనే డెస్క్‌టాప్ యూజర్లకు ఒరిజినల్ క్వాలిటీతో ఫొటో, వీడియోలు షేర్ చేసుకునే ఫీచర్‌ను వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఆప్షన్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది.
భవిష్యత్తులో రాబోయే యాప్ అప్‌డేట్‌లో భాగంగా యూజర్లకు అందనుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ ఫొటోలు, వీడియోల రిజల్యూషన్, క్లారిటీని కాపాడుతుంది. వాట్సాప్ వినియోగదారులకు ఇమేజ్ క్వాలిటీ, రిజల్యూషన్‌ను కోల్పోతామనే ఆందోళన అవసరం ఉండదు. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, వినియోగదారులు స్టాండర్డ్ కంప్రెషన్ పద్ధతిని ఉపయోగించి ఫోటోలను షేర్ చేయగలరని నివేదిక చెబుతోంది. స్టోరేజ్ స్పేస్ కాపాడుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంటుందని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి : ఈ మొబైల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొంటే రూ.20,000 డిస్కౌంట్... కర్వ్‌డ్ డిస్‌ప్లే, పాపులర్ ప్రాసెసర్, మరెన్నో ఫీచర్స్
* వాయిస్ మెసేజ్ వాట్సాప్ స్టేటస్
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వినియోగదారులకు వాయిస్ మెసేజ్‌లను స్టేటస్‌లో షేర్ చేసుకునే ఫీచర్‌ను విడుదల చేస్తోంది. వాయిస్ మెసేజ్ స్టేటస్‌లో షేర్ చేసిన తర్వాత, చాట్ లిస్ట్, ఇతర ప్రదేశాలలో ప్రొఫైల్ ఫోటోల చుట్టూ రింగ్ కనిపిస్తుంది. వాట్సాప్ స్టేటస్ రియాక్షన్స్ ఆప్షన్ కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ ప్రియమైన వారికి ఒక్క ట్యాప్‌తో స్పందన తెలియజేసే అవకాశం ఉంటుంది.
* హ్యాండ్స్ ఫ్రీ రికార్డింగ్ ఆప్షన్
వాట్సాప్ కొంతమంది వినియోగదారులకు కొత్త కెమెరా మోడ్‌ను కూడా రిలీజ్ చేస్తోంది. కొత్త కెమెరా మోడ్‌తో వినియోగదారులు కేవలం ఒక్క ట్యాప్‌తో ఫోటో మోడ్ నుంచి వీడియో మోడ్‌కి మారగలరు. హ్యాండ్స్-ఫ్రీ వీడియో రికార్డింగ్ ఆప్షన్‌ను వాట్సాప్ అందిస్తోంది. వీడియోలను రికార్డ్ చేయడానికి ఇకపై ట్యాప్ చేసి హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. iOS 23.2.0.70 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Features, New feature, Photos, Tech news, Whatsapp