Home /News /technology /

WHATSAPP IS TESTING PAUSE AND PLAY WHILE RECORDING VOICE MESSAGES ON DESKTOP GH VB

WhatsApp: వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో సరికొత్త అప్‌డేట్‌.. ప్లే అండ్ పాజ్ చేసే ఫీచర్‌ తో మన ముందుకు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల (new features)తో యూజర్లను ఫిదా చేస్తోంది. మొబైల్ యాప్‌లోనే కాదు డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ (desktop version)లో వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్ చేసి మళ్లీ వాటిని ప్రారంభించేందుకు వీలుగా ఓ ఫీచర్ పరీక్షిస్తోంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల (new features)తో యూజర్లను ఫిదా చేస్తోంది. మొబైల్ యాప్‌లోనే కాదు డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ (desktop version)లో వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్ చేసి మళ్లీ వాటిని ప్రారంభించేందుకు వీలుగా ఓ ఫీచర్ పరీక్షిస్తోంది. ఇప్పటికే డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ను వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) గుర్తించింది. లేటెస్ట్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో కొత్త పాజ్ బటన్ గుర్తించినట్లు తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. బీటా కోసం నమోదు చేసుకున్న ఎవరికైనా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. డెస్క్‌టాప్ వెర్షన్ యాప్ వాయిస్ మెసేజ్‌లను పంపే ముందు ప్రివ్యూ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

WhatsApp: డెస్క్‌టాప్ వెర్షన్‌లో వాట్సాప్ లాగిన్ అవుతున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..


గతంలో వాయిస్ మెసేజ్ పంపే ముందు పాజ్ బటన్ కనిపించకపోయేది. అయితే ఇప్పుడు పాజ్ కనిపించడంతో పాటు వాయిస్ మెసేజ్ ప్రివ్యూ చేయడానికి కూడా సదుపాయం అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయనప్పటికీ... ఈ ఫీచర్ ఐఓఎస్ యాప్ బీటా వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. కొత్త పాజ్ బటన్ అనేది వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా 2.2201.2లో కనిపించింది. యూజర్లు కొత్త బటన్‌ను తమకు అందుబాటులోకి వచ్చినట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. అన్ని బీటా ఖాతాలలోకి ఇది లాంచ్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు.

IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

వాట్సాప్ గత సంవత్సరం దాని ఐఓఎస్ యాప్ బీటా వెర్షన్‌లకు ఈ పాజ్ అండ్ ప్లే ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్లు ఎక్కువగా అడిగిన ఫీచర్‌లలో ఇది ఒకటి. సుదీర్ఘ వాయిస్ మెసేజ్ చాట్‌ల సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ రికార్డింగ్‌లను పంపే ముందు వాటిని చెక్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఇటీవల వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ లో యాప్‌లో ఇన్-చాట్ సపోర్ట్ సామర్థ్యాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఇది యూజర్లు వాట్సాప్ సపోర్ట్ తో చాట్‌లను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. ఇది సమస్యలను వేగంగా పరిష్కరించడంలో మీకు సహాయపడటానికి రిపోర్ట్ ఇన్ఫో, ప్రాబ్లమాటిక్ ఇన్ఫో సేకరిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Whatsapp, Whatsapp number

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు