• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • WHATSAPP IS SOON EXPECTED TO ADD THE END TO END ENCRYPTED BACKUPS OPTION IN THE MESSAGING APP NS GH

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇప్పుడు మీ ఛాట్స్‌ ఇంకా సేఫ్.. ఎలాగంటే..

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇప్పుడు మీ ఛాట్స్‌ ఇంకా సేఫ్.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం తన సాంకేతికతలో అనేక మార్పులు తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కస్టమర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తాం అంటూ చాలా రోజుల నుంచి చెబుతూ వస్తోంది వాట్సాప్‌. ఇందులో భాగంగా తన సాంకేతికతలో చాలా మార్పులు చేస్తూ వస్తోంది సంస్థ. కొన్ని రోజుల క్రితం ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. అంటే మీరు పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి మాత్రమే చూడగలరు. మధ్యలో వాట్సాప్‌ దానిని చదవలేదు. అలా ఎన్‌క్రిప్షన్‌ రూపంలో ఆ ఛాట్స్‌ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇప్పుడు ఈ తరహా ఫీచర్‌ను ఛాట్‌ బ్యాక్‌ అప్స్‌కి కూడా తీసుకురాబోతోంది. అంటే మీ మొబైల్‌లో వాట్సాప్‌ ఛాట్‌/గ్రూప్స్‌కు సంబంధించిన బ్యాక్‌అప్‌ ఫైల్‌ను ఇకపై థర్డ్‌ పార్టీ యాప్స్‌ కానీ, వాట్సాప్‌/ఫేస్‌బుక్‌ చూడలేవట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగాత్మకంగా కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
WhatsApp: ప్రైవసీ పాలసీపై వాట్సాప్ కొత్త మెలిక... ఒప్పుకోకపోతే... ఈ సర్వీసుల్లో కోత

వాట్సాప్‌లో ఛాట్స్‌/ గ్రూప్‌ ఛాట్స్‌ను బ్యాకప్‌ తీసుకోవచ్చనే విషయం మీకు తెలిసిందే. మీరు ముందుగా నిర్దేశించినట్లు రోజు/వారం అనే లెక్క ప్రకారం ఛాట్స్‌ బ్యాకప్‌ అవుతాయి. తొలుత బ్యాకప్‌ ఫైల్‌ మీ మొబైల్‌లో క్రియేట్‌ అయ్యి... ఆ తర్వాత అవి గూగుల్‌ డ్రైవ్‌/ ఐక్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ అవుతాయి. ఈ క్రమంలో ఆ ఛాట్‌ బ్యాకప్‌ను వేరే ఎవరైనా యాక్సెస్‌ చేస్తారనే భయం చాలామందిలో ఉంది. వాట్సాప్‌పై కూడా ఈ అనుమానాల్ని కొంతమంది వ్యక్తం చేశారు. వీటిని పటాపంచలు చేస్తూ తాజాగా వాట్సాప్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ పీచర్‌ సెట్టింగ్స్‌లోని ఛాట్‌ బ్యాకప్‌ ఆప్షన్‌లోనే ఉండబోతోంది.

ఛాట్‌ బ్యాకప్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను ఎంచుకుంటే పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేయమని అడుగుతుంది. మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఆన్‌ అవుతుంది. ఆ తర్వాత బ్యాకప్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఫోన్‌ మార్చినా, వాట్సాప్‌ను రీ ఇన్‌స్టాల్‌ చేసినా... ఛాట్స్‌ రెస్టోర్‌ అయినప్పుడు ఆ పాస్‌వర్డ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలా పాస్‌వర్డ్‌ ఇస్తేనే ఆ ఛాట్స్‌ డీక్రిప్ట్‌ అయ్యి... మొబైల్‌లోని వాట్సాప్‌లోకి వచ్చి చేరుతాయి. ఈ క్రమంలో పాస్‌వర్డ్‌ మరచిపోతే ఉపయుక్తంగా ఉండేందుకు ఒక రికవరీ కీని వాట్సాప్‌ ఇస్తుంది. దానిని కూడా మరచిపోతే వాట్సాప్‌ ఛాట్స్‌ను డీక్రిప్ట్‌ చేయలేరు.

మరోవైపు వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీ కోసం విధించిన గడువు దగ్గరకొస్తోంది. ఈ నెల 15లోపు ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్‌ చేయాలి. అయితే గతంలో చెప్పినట్లు ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్‌ చేయని వారి అకౌంట్లను వాట్సాప్‌ నిలిపేయదు. ప్రైవసీ పాలసీని వివరిస్తూ ఎప్పటికప్పుడు రిమైండ్‌ చేస్తూ ఉంటుంది. అలా మీరు యాక్సెప్ట్‌ చేసేవరకు రిమైండర్స్‌ వస్తుంటాయట. అయితే ఈ క్రమంలో పాలసీని యాక్సెప్ట్‌ చేయనివారు రోజులు గడిచే కొద్దీ కొన్ని ఫీచర్లను యూజర్లు కోల్పోతారని తెలుస్తోంది. వాటిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published: