WHATSAPP IS ROLLING OUT VOICE WAVEFORMS TO MAKE THE CHAT LOOKS MORE INTERESTING GH SSR
WhatsApp: వాట్సాప్‌లో మీరు చాట్ చేయకుండా వాయిస్ మెసేజ్‌లు ఎక్కువగా పంపిస్తుంటారా.. అయితే మీకో గుడ్‌న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
వాయిస్ మెసేజ్ ఫీచర్‌కు మరిన్ని హంగులు దిద్దేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు వాయిస్ వేవ్‌ఫామ్స్(voice waveforms) అనే మరో కొత్త అప్డేట్ను అందించేందుకు వాట్సాప్ సిద్ధమైంది. దీన్ని ఇప్పటికే డెవలపర్లు అభివృద్ధి చేసి కొంతమంది బీటా టెస్టర్లకు విడుదల చేశారు.
దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే ఉన్న ఫీచర్లకు సరికొత్త హంగులు జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్. వీటన్నిటిలో వాయిస్ మెసేజ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. టైప్ చేయడం కుదరనప్పుడు ఈ వాయిస్ మెసేజ్ ద్వారా సింపుల్‌గా అవతలి వ్యక్తికి సమాచారం అందించవచ్చు. ఈ వాయిస్ మెసేజ్ ఫీచర్‌కు మరిన్ని హంగులు దిద్దేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు వాయిస్ వేవ్‌ఫామ్స్(voice waveforms) అనే మరో కొత్త అప్డేట్ను అందించేందుకు వాట్సాప్ సిద్ధమైంది. దీన్ని ఇప్పటికే డెవలపర్లు అభివృద్ధి చేసి కొంతమంది బీటా టెస్టర్లకు విడుదల చేశారు. ఈ అప్డేట్ అతిత్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే ఓల్డర్ వెర్షన్‌ని వాడుతున్న యూజర్లకు ఈ అప్డేట్ రాకపోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది బీటా టెస్టర్లందరికీ అందుబాటులో లేదు. కొందరికి మాత్రమే ఈ అప్డేట్ రోల్అవుట్ అయ్యింది.
ప్రస్తుతం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్/నోట్ ప్లే అవుతుంటే సింగిల్ బార్‌లోని ఒక లైన్.. టైం చూపిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే కొత్త లేఅవుట్ వల్ల వాయిస్ నోట్ ప్లే అవుతున్నప్పుడు ఈ లైన్‌కు బదులు తరంగాల రూపంలో కిందికి, పైకి లైన్స్ కదులుతూ కనిపిస్తాయి. దీని వల్ల వాయిస్ నోట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
"కొందరు బీటా టెస్టర్లు ఇప్పుడు చాట్ బబుల్స్‌లో వాయిస్ వేవ్ఫామ్లను చూడగలరు. మీ వాట్సాప్ అకౌంట్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వాయిస్ నోట్లను ప్లే చేస్తున్నప్పుడు వాయిస్ వేవ్ఫామ్లను చూడవచ్చు. ఒకవేళ మీరు వాయిస్ నోట్లను ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ నుంచి రిసీవ్ చేసుకుంటే.. అవి ప్లే చేసేటప్పుడు వాయిస్ వేవ్ఫామ్లు కనిపించకపోవచ్చు. ఎందుకంటే వారి వాట్సాప్ లో ఈ ఫీచర్ డిజేబుల్ చేసి ఉండొచ్చు. లేదా వారు పాత వాట్సాప్ వెర్షన్‌ని ఉపయోగించి వాయిస్ నోట్ రికార్డ్ చేసి పంపించి ఉండొచ్చు" అని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
“ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాట్సాప్ బీటా టెస్టర్లకు కొత్త లేఅవుట్ అందుబాటులోకి వస్తోంది. కొత్త అప్డేట్లను విడుదల చేసిన తర్వాత మరిన్ని యాక్టివేషన్లు ప్లాన్ చేస్తున్నారు.” అని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్ ఇంకా మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు పని చేస్తోంది. ఎన్నో భావాలను సింపుల్‌గా చెప్పడానికి యూజర్లు ఎమోజీలను విపరీతంగా వాడుతున్నారు. అయితే చాటింగ్ లో కీలకంగా మారిన ఎమోజీల ఫీచర్ ను కూడా వాట్సాప్ మెరుగుపరుస్తోంది. టైప్ చేయకుండానే చాట్‌లో ఒక మెసేజ్ కు ఎమోజీ జోడించేలా మెసేజ్ రియాక్షన్ ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సాప్ పని చేస్తోంది. అలాగే స్టిక్కర్లను వ్యూ, డౌన్లోడ్ చేయకుండానే ఇతరులకు ఫార్వర్డ్ చేసే మరో ఫీచర్‌ను తీసుకొస్తోంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.