Home /News /technology /

WHATSAPP IS ROLLING OUT BLOCKING OF SCREENSHOTS ON VIEW ONCE PHOTO FEATURE TO THE BETA TESTERS ON ANDROID GH SRD

WhatsApp: ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్.. ఇక మీ ఫొటోలు మరింత భద్రం..!

WhatsApp

WhatsApp

WhatsApp: వాట్సాప్ వ్యూ వన్స్ మీడియాను స్క్రీన్‌షాట్లు తీసుకోకుండా బ్లాక్ చేసే ఫీచర్ తీసుకొస్తామని కొద్ది రోజుల క్రితం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ప్రైవసీ ఫీచర్లను తీసుకొచ్చింది. వాటిలో వ్యూ వన్స్ (View Once) ఫీచర్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. ఈ ఫీచర్‌ అనేది పంపిన ఫొటో లేదా వీడియో అనేది అవతల వ్యక్తికి ఒక్కసారి కంటే ఎక్కువగా కనిపించకుండా, వారి ఫోన్‌లో సేవ్ కాకుండా సహాయపడుతుంది. అయితే స్క్రీన్‌షాట్ తీసుకుంటే మాత్రం ఈ ఫీచర్ వల్ల ఉపయోగం లేకుండాపోతోంది. దీనికి పరిష్కారంగా స్క్రీన్‌షాట్లు తీసుకోకుండా బ్లాక్ చేసే ఫీచర్ తీసుకొస్తామని కొద్ది రోజుల క్రితం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో వాట్సాప్‌ టెస్ట్ చేస్తున్నట్లు WABetaInfo తెలిపింది.

ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉన్నా త్వరలోనే ఒక ఫ్యూచర్ అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు లాంచ్ అవుతుందని WABetaInfo వెల్లడించింది. అప్‌కమింగ్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్ వస్తున్నట్లు ఓ స్క్రీన్‌షాట్‌తో సహా వాట్సాప్‌ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో వ్యూ వన్స్‌ ఫొటో ఓపెన్ చేయగానే... "ఈ ఫొటోని మీరు ఫార్వార్డ్ చేయలేరు. కాపీ చేయలేరు, సేవ్ చేయలేరు లేదా స్క్రీన్‌షాట్ తీయలేరు" అనే పాప్-అప్‌ కనిపించినట్లు చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వ్యూ వన్స్ మీడియాకి మరింత భద్రత పెరుగుతుంది.

ఆగస్టు 9న వాట్సాప్‌లో మూడు కొత్త ప్రైవసీ ఫీచర్లను లాంచ్ చేయనున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. వ్యూ వన్స్ మెసేజెస్‌లోని ఫొటోలు స్క్రీన్‌షాట్లు తీసుకోకుండా బ్లాక్ చేసే ఫీచర్ వీటిలో ఒకటిగా ఉంది.

ఇప్పుడు వాట్సాప్ ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్‌లకు అందించే పనిలో నిమగ్నం అయ్యింది. ఆల్రెడీ అధికారికంగా ప్రకటించడంతో పాటు బీటా వెర్షన్‌లో కూడా ఈ సదుపాయం తీసుకొస్తున్నట్లు తెలిసింది కాబట్టి ఈ ఫీచర్ రిలీజ్ కావడానికి మరెన్నో రోజులు పట్టదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చే జాబ్ లింక్స్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు..

సాధారణంగా వ్యూ వన్స్ ఆప్షన్ ఉపయోగించి పంపే మెసేజ్ లేదా వీడియో అవతలి వ్యక్తికి ఒక్కసారే కనిపిస్తుంది. కానీ స్క్రీన్‌షాట్ తీసుకుంటే అది శాశ్వతంగా వారి ఫోన్‌లోనే ఉండి పోతుంది. దీనివల్ల యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. త్వరలో ఈ స్క్రీన్‌షాట్ తీసుకునే సౌలభ్యం కూడా ఉండదు.

కాకపోతే అవతలి వ్యక్తి 'వ్యూ వన్స్'గా పంపిన మీడియాను మరొక డివైజ్ నుంచి ఫొటో తీసుకోవడం లేదా స్క్రీన్ రికార్డ్ కూడా చేయడం కుదురుతుంది. ఈ ఫీచర్ కాకుండా గ్రూప్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ కావడానికి వీలు కల్పించే ఫీచర్, ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే ఫీచర్ తెస్తామని జుకర్‌బర్గ్ వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Mark Zuckerberg, Tech news, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు