WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

WhatsApp | వాట్సప్ తన యూజర్లకు మరిన్ని కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తోంది. త్వరలో రెండు ఫీచర్స్ రాబోతున్నాయి.

news18-telugu
Updated: June 24, 2020, 11:15 AM IST
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. వాట్సప్‌లో త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్స్ రాబోతున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించే WABetaInfo ప్రకారం వాట్సప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే ఆండ్రాయిడ్ 2.20.194.7, ఐఓఎస్ 2.20.70.26 వర్షన్‌ అప్‌డేట్ చేయాలి. మీకు వాట్సప్ యానిమేటెడ్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని సేవ్ చేయొచ్చు. ఇతరులకు పంపొచ్చు. అంతేకాదు... ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఉన్న యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్ త్వరలో ఇతర యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.


ఇక వాట్సప్ నుంచి మరో ఫీచర్ రాబోతోంది. డార్క్ మోడ్ ఉపయోగిస్తున్నవారికి ఛాట్ విండోలో కొన్ని మార్పులు చేయబోతోంది వాట్సప్. ఛాట్ బబుల్‌ కలర్‌ని మార్చబోతోంది. కొత్త కలర్ ద్వారా యూజర్లకు ఛాటింగ్ సమయంలో ఇంకా సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్త కలర్‌ని పరిచయం చేయనుంది వాట్సప్. ఈ మార్పులు కేవలం డార్క్ మోడ్‌కు మాత్రమే. మీరు లైట్ మోడ్‌లోకి వెళ్తే ఛాట్ బబుల్ ఇప్పుడు ఉన్న కలర్‌లోనే ఉంటుంది. మీరు మీ వాట్సప్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తే ఈ కొత్త ఫీచర్స్‌ని ఉపయోగించుకోవచ్చు.ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్

Vodafone: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... 5జీబీ డేటా ఎక్కువ వాడుకోవచ్చు ఇలా

Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
First published: June 24, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading