హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: 'డు నాట్ డిస్టర్బ్' మోడ్‌కు సపోర్ట్ రిలీజ్ చేస్తోన్న వాట్సాప్.. దీని బెనిఫిట్ ఏంటంటే..

WhatsApp: 'డు నాట్ డిస్టర్బ్' మోడ్‌కు సపోర్ట్ రిలీజ్ చేస్తోన్న వాట్సాప్.. దీని బెనిఫిట్ ఏంటంటే..

WhatsApp: 'డు నాట్ డిస్టర్బ్' మోడ్‌కు సపోర్ట్ రిలీజ్ చేస్తోన్న వాట్సాప్.. దీని బెనిఫిట్ ఏంటంటే..

WhatsApp: 'డు నాట్ డిస్టర్బ్' మోడ్‌కు సపోర్ట్ రిలీజ్ చేస్తోన్న వాట్సాప్.. దీని బెనిఫిట్ ఏంటంటే..

దిగ్గజ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'Do Not Disturb API-missed calls' అనే కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

దిగ్గజ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'Do Not Disturb API-missed calls' అనే కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. సాధారణంగా యూజర్లు తమ ఫోన్‌లో 'Do Not Disturb' మోడ్ ఆన్ చేసినప్పుడు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌ వంటి అలర్ట్స్ అన్ని మ్యూట్ అయిపోతాయి. కాల్స్ వస్తున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ కూడా రావు. ఫోన్ స్క్రీన్‌ కూడా వెలగదు. కాబట్టి ఈ మోడ్‌లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వస్తుందనే విషయం తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. దీనివల్ల కాల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అవతలి వ్యక్తికి మీరు ఈ మోడ్ ఆన్ చేయడం వల్ల కాల్ మిస్ అయ్యామనే విషయం తెలియదు. ఫలితంగా వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమస్య తన యూజర్లకు ఎదురు కావద్దనే వాట్సాప్ ఈ అప్‌డేట్ తీసుకొస్తుంది.

TSPSC Six Notifications: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నవంబర్ 20 తర్వాత 6 నోటిఫికేషన్లు..

దీనివల్ల ప్రయోజనం ఏంటి

'డు నాట్‌ డిస్టర్బ్' మోడ్‌కు సపోర్ట్ ఫీచర్‌ అనేది గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది బీటా టెస్టర్స్‌కి రిలీజ్ అవుతున్నట్లు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. అలానే ఈ ఫీచర్‌కి సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ కూడా పంచుకుంది. ఈ స్క్రీన్‌షాట్‌లో వాట్సాప్ కాల్స్ ట్యాబ్‌లో కాల్స్ హిస్టరీలో 'సైలెన్స్‌డ్‌ బై డు నాట్ డిస్టర్బ్' అని ఒక ఇన్ఫో/ట్యాగ్‌లైన్‌ కనిపించింది. దీన్నిబట్టి వాట్సాప్‌లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేయడం వల్ల కాల్ లిఫ్ట్ చేయడం కుదరకపోతే యూజర్లకు ఆ కారణాన్ని ఒక ట్యాగ్‌లైన్‌తో వాట్సాప్ తెలియజేస్తుంది. అలా యూజర్లు కాల్ చేసిన అవతలి వ్యక్తికి ఈ నోటిఫికేషన్స్‌ చూపించి తాము కాల్‌ ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయామో తెలుపవచ్చు.

ఈ ఫీచర్ మీ అకౌంట్‌కు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఇందుకు మీ ఫోన్ సెట్టింగ్స్‌లో డు నాట్ డిస్టర్బ్ మోడ్‌ను ఎనేబుల్ చేయాలి. మీ వాట్సాప్‌కు కొన్ని సెకన్ల పాటు కాల్ చేయమని ఫ్రెండ్‌ని అడగాలి. ఆ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండాలి. కొంత సమయం తర్వాత మీ వాట్సాప్ యాప్ కాల్స్ ట్యాబ్‌లో కాల్ హిస్టరీలో మీ ఫ్రెండ్ కాల్ వివరాల కింద సైలెన్స్‌డ్‌ బై డు నాట్ డిస్టర్బ్' అని ఒక ట్యాగ్‌లైన్‌ కనిపిస్తే అప్పుడు ఈ ఫీచర్ మీక్కూడా రిలీజ్ అయినట్లు అర్థం. ఈ ట్యాగ్‌లైన్‌ లేదా మిస్డ్ కాల్ ఇన్ఫో కాల్ రిసీవ్ చేసుకున్న యూజర్స్‌కి మాత్రమే కనిపిస్తుంది. మీ ఫోన్‌లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల కాల్‌ని మిస్ చేసుకున్నారని అవతలి వ్యక్తికి తెలియదు. స్క్రీన్‌షాట్‌ చూపించే వారికి విషయాన్ని తెలియజేయవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.22.24.17 బీటా వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ రిలీజ్ అవుతోంది కాబట్టి రెగ్యులర్ యూజర్లు దీనికోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

First published:

Tags: 5g technology, Whatsapp

ఉత్తమ కథలు