హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: ఇక, వాట్సాప్ లో అలా చేయలేరు.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!

WhatsApp: ఇక, వాట్సాప్ లో అలా చేయలేరు.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!

WhatsApp: ఇక, వాట్సాప్ లో అలా చేయలేరు.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!

WhatsApp: ఇక, వాట్సాప్ లో అలా చేయలేరు.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ల ప్రైవసీని మెరుగుపరిచేందుకు అనునిత్యం సరికొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందులో భాగంగా అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు లాంచ్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ల ప్రైవసీని మెరుగుపరిచేందుకు అనునిత్యం సరికొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ (Screenshot Blocking) ఫీచర్‌ను యూజర్లకు లాంచ్ చేస్తోంది. 2022 ప్రారంభంలో వ్యూ వన్స్ (View Once) ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. రిసీవర్ ఒక్కసారి చూడగానే వారి డివైజ్‌ నుంచి ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఫొటోలు, వీడియోలను పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే ఈ అవతలి వ్యక్తి పంపించిన ఫొటోని స్క్రీన్‌షాట్ తీసినా లేదా వీడియోను స్క్రీన్ రికార్డ్ చేసినా ఫీచర్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే స్క్రీన్‌షాట్ బ్లాకింగ్‌ను వాట్సాప్ రిలీజ్ చేస్తోంది.

* బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఫీచర్‌

వ్యూ వన్స్ మెసేజ్‌లలో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు రిలీజ్ అవుతున్నట్లు వాట్సాప్ ఫీచర్ల ట్రాకర్ WaBetaInfo వెల్లడించింది. ఈ ఫీచర్ యూజర్లు వ్యూ వన్స్ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా బ్లాక్ చేస్తోందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఈ మెసేజ్‌లను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయకుండా యూజర్లను న్యూ ఫీచర్ బ్లాక్ చేస్తోందని WaBetaInfo వెల్లడించింది. ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

* స్క్రీన్‌షాట్‌ తీయడం సాధ్యం కాదు

కొత్త ఫెసిలిటీతో యూజర్లు వ్యూ వన్స్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను తీసుకోలేరు. ఒకవేళ వారు స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నిస్తే, ఆ స్క్రీన్‌షాట్ అనేది బ్లాక్‌గా ఉంటుంది. అలానే "సెక్యూరిటీ పాలసీ కారణంగా స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. యాడెడ్‌ ప్రైవసీ కారణంగా స్క్రీన్‌షాట్ బ్లాక్ అయింది" అని ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. అయితే ఈ సెక్యూరిటీని దాటవేయడానికి థర్డ్ పార్టీ అప్లికేషను వాడినా సరే స్క్రీన్‌షాట్‌ తీయడం కుదరదు. ఒకవేళ తీసినా అది ఎల్లప్పుడూ బ్లాక్‌గానే కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : ట్విట్టర్‌ యూజర్స్ కి అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్..!

* త్వరలో అందరికీ లభించనున్న అప్‌డేట్‌

వ్యూ వన్స్ ఫొటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేయడం, ఎక్స్‌పోర్ట్ చేయడం లేదా సేవ్ చేయడం సాధ్యం కాదు. కానీ రిసీవర్ సెకండరీ ఫోన్ వాడితే మాత్రం యూజర్ల వ్యూ వన్స్ మెసేజ్‌లను ఫొటో తీయడం కుదురుతుంది. అలాగే వాటిని రికార్డు కూడా చేయగలరు. కాబట్టి వ్యూ వన్స్ ద్వారా బాగా పర్సనల్ ఫొటోలు పంపే ముందు యూజర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ అనేది ఓన్లీ వ్యూ వన్స్ ఫొటోలు, వీడియోలకు మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల డిసప్పియరింగ్, నార్మల్ మెసేజ్‌ల్లో పంపించిన వాటిని స్క్రీన్‌షాట్ తీయడం కుదురుతుంది. ముందుగా చెప్పినట్లు అప్‌డేటెడ్ వాట్సాప్ బీటా వెర్షన్స్‌ ఉపయోగించే కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ విడుదలైంది. ఇది మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ యూజర్లందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: New feature, Tech news, Whatsapp

ఉత్తమ కథలు