ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)లో స్నేహితులు, బంధువులు, ప్రియమైనవారు.. ఇలా అందరికీ మెసేజ్‌లు పంపిస్తుంటారు యూజర్లు. అయితే ఒక్కోసారి ఒకరికి పంపించాల్సిన మెసేజ్‌ను ఇంకొకరికి పొరపాటున పంపుతుంటారు. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone)' అనే ఫీచర్ (Feature) పరిచయం చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌తో 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల లోపు సెండ్ చేసిన మెసేజ్‌లను మాత్రమే అందరికీ డిలీట్ (Delete For Everyone) చేయడం కుదురుతుంది. అయితే ఇప్పుడు ఆ టైమ్ లిమిట్ (Time Limit)ను వాట్సాప్ రెండు రోజులకు పైగా పెంచింది. దీనర్థం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ను రెండు రోజుల తరువాత కూడా అవతల వ్యక్తి చాట్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. పెంచిన ఈ టైమ్ లిమిట్ తాజాగా కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలోనే యూజర్లందరికీ రిలీజ్ అయ్యే అవకాశముందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ 2.22.15.8 యాప్ వినియోగించే కొందరికి ఈ టైమ్ లిమిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ యూజర్లు ఇప్పుడు పంపిన మెసేజ్‌ను 2 రోజుల 12 గంటల సమయంలోగా అందరికీ డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌తో రెండు రోజుల క్రితం పంపిన మెసేజ్‌లు కూడా డిలీట్ చేసుకునే అవకాశం వస్తే చాలా మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కోసారి కొందరు మెసేజ్ పంపిన రెండు, మూడు గంటల తర్వాత మళ్లీ దానిని చూస్తుంటారు. ఆ మెసేజ్ తప్పుగా పంపించినా.. మెసేజ్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా.. అసలు మెసేజ్ పంపకూడదని అనుకున్నా.. వారు అందరికీ డిలీట్ చేయాలి అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న లిమిట్ ఒక గంట మాత్రమే ఉండటంతో అది సాధ్యం కాక విసుగ్గా, నిరాశగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి సమస్యలు యూజర్లకు ఇకపై ఎదురు కాకూడదని వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్‌ను భారీగా పెంచేసింది.
వాట్సాప్ పోటీదారు టెలిగ్రామ్ పంపిన 48 గంటల తర్వాత మెసేజ్‌లను అందరికీ డిలీట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే వాట్సాప్ టెలిగ్రామ్ కంటే 12 గంటలకు ఎక్కువ టైమ్ లిమిటెడ్ అందించడానికి సిద్ధమై దాని కంటే మెరుగైన సర్వీస్‌గా నిలవాలని చూస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం, మెసేజ్‌లను డిలీట్ చేయడానికి పెరిగిన కాల పరిమితి గురించి యూజర్లకు తెలిపే ఏ నోటిఫికేషన్‌ను వాట్సాప్ బీటా వెర్షన్లో అందించడం లేదు. అందువల్ల యూజర్లు ఈ ఫీచర్‌ను తమంతట తామే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఒక మెసేజ్ పంపించి అది రెండు రోజుల తర్వాత అందరికీ డిలీట్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది. వాట్సాప్ మరో డిలీట్ మెసేజ్ ఫీచర్‌ని కూడా త్వరలోనే పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్లు గ్రూప్‌లోని ఇతర సభ్యులకు చాట్లను డిలీట్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Message, New features, Tech news, Whatsapp