Good News: వాట్సప్ వాడితే ఆరోగ్యానికి మంచిదే... ఎలాగో తెలుసా?

WhatsApp | వాట్సప్‌లాంటి టెక్స్ట్‌ బేస్డ్ మెసేజింగ్ యాప్‌‌లో గ్రూప్ ఛాట్స్ ద్వారా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: July 1, 2019, 11:18 AM IST
Good News: వాట్సప్ వాడితే ఆరోగ్యానికి మంచిదే... ఎలాగో తెలుసా?
Good News: వాట్సప్ వాడితే ఆరోగ్యానికి మంచిదే... ఎలాగో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... కోట్లాదిమందిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. వాట్సప్ లాంటి సోషల్ మీడియా వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని, అడిక్షన్‌కు దారితీస్తుందని, ఆ వ్యసనం మరిన్ని సమస్యలకు కారణమవుతుందన్న ఆందోళనలు చాలాకాలంగా ఉన్నవే. అయితే వాట్సప్‌లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సమయం గడపడం ఆరోగ్యానికి మంచిదని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ కంప్యూటర్ స్టడీస్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం... వాట్సప్‌లాంటి టెక్స్ట్‌ బేస్డ్ మెసేజింగ్ యాప్‌‌లో గ్రూప్ ఛాట్స్ ద్వారా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది. 'ఆన్‌లైన్ ఛాటింగ్ పద్ధతులు మానసిక ఆరోగ్యంపై చూపించే ప్రభావాలు' అనే అంశంపై జరిపిన అధ్యయనం ఇది.

సోషల్ మీడియా వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ అన్న వాదన చాలాకాలంగా ఉన్నదే. కానీ సోషల్ మీడియా మరీ అంత చెడ్డదేమీ కాదని అధ్యయనం తేల్చింది. రోజూ ఎక్కువ సమయం వాట్సప్ ఉపయోగించినవారిలో స్నేహితులు, కుటుంబసభ్యులతో దగ్గరగా ఉన్నామన్న ఫీలింగ్‌ కలగడంతోపాటు ఒంటరితనం అనే భావన తక్కువగా ఉందని, ఆత్మగౌరవం పెరిగిందని తేలింది.

లిండా కేయ్, ఎడ్జ్ హిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్


మొత్తం 200 మంది యూజర్లతో అధ్యయనం జరిపారు పరిశోధకులు. వారిలో 158 మంది మహిళలు కాగా, 42 మంది పురుషులు. వారి సగటు వయస్సు 24 ఏళ్లు. అందరూ రోజూ 55 నిమిషాల కన్నా ఎక్కువగా వాట్సప్ ఉపయోగించారు. వాట్సప్ ఛాటింగ్‌ వారిపై సానుకూల ప్రభావం చూపించింది. అంతేకాదు... వాట్సప్ గ్రూప్స్‌లో ఛాటింగ్ చేసేవారిలో ఒంటరితనం భావనలు తగ్గాయి. మానసిక ఆరోగ్యం కోసం టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో ఈ అధ్యయనం నిరూపించిందని భావిస్తున్నారు పరిశోధకులు.

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్

DeepNude: ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ

Save Battery: మీ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందా? ఈ టిప్స్ మీకోసమే
Published by: Santhosh Kumar S
First published: July 1, 2019, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading