WHATSAPP IS GETTING THIS NEW AUDIO FEATURE CHECK FULL DETAILS HERE JNK GH
WhatsApp: కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్.. ఆడియో మెసేజెస్ ప్లేబ్యాక్ స్పీడ్‌ని సర్దుబాటు చేసుకునే అవకాశం
వాట్సప్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp New Feature: వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఆడియో మెసేజెస్‌లో ప్లేబ్యాక్ స్పీడ్‌ని అడ్జెస్ట్ చేసుకోగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన వాయిస్ నోట్ ప్లేబ్యాక్ టూల్ తరహాలో ఈ కొత్త ఫీచర్ ఉంటుంది.
మెటా (Meta) (గతంలో ఫేస్బుక్(Facebook)) యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) రోజుకో కొత్త ఫీచర్‌ను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను సర్ప్రైజ్ చేస్తుంది. అందుకే ఇప్పటికీ టాప్ సోషల్ మీడియా (Social Media) వేదికగా రాణిస్తోంది. ఇదే దూకుడుతో వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్‌పై (New Feature) పనిచేస్తోంది. ఆడియో మెసేజెస్‌లో ప్లేబ్యాక్ స్పీడ్‌ని అడ్జెస్ట్ చేసుకోగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన వాయిస్ నోట్ ప్లేబ్యాక్ టూల్ తరహాలో ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. ఈ కొత్త ఆడియో ప్లేబ్యాక్ ఫీచర్ వాయిస్ నోట్‌ని పోలి ఉంటుంది. ఈ ఆడియో ఫైల్ తప్పనిసరిగా ఇతరుల నుంచి రిసీవ్ చేసుకున్న ఫైల్ అయి ఉండాలి.
ఈ కొత్త ఫీచర్ తొలుత ఐఓఎస్ డివైజ్‌లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాతి కాలంలో ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు వాట్సాప్ బీటా ఇన్ఫో ధ్రువీకరించింది. అయితే వినియోగదారులు తమ ఆడియో సందేశాల ప్లేబ్యాక్ వేగాన్ని ఎంత వరకు పెంచవచ్చనే దానిపై మాత్రం వాట్సాప్ స్పష్టతనివ్వలేదు. విడుదలైన స్క్రీన్షాట్ల ప్రకారం, వినియోగదారులు ప్లేబ్యాక్‌ని 2x పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ ఫీచర్ సహాయంతో ప్లే బ్యాక్ స్పీడ్‌ను పెంచడమే తప్ప తగ్గించే అవకాశం లేదు.
తాజాగా వాట్సాప్ భారతదేశంలో రెండు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను కూడా విడుదల చేసింది. ఫ్లాష్ కాల్స్, మెసేజ్-లెవల్ రిపోర్టింగ్ అనే రెండు ఫీచర్లను రిలీజ్ చేసింది. వీటితో పాటు వాట్సాప్ వినియోగదారులు వారి సందేశాలను డిలీట్ చేసుకోగల సమయాన్ని పెంచనుంది. ప్రస్తుతం వాట్సాప్ 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు మెసేజెస్ను డిలీట్ చేసుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇప్పుడు, ఈ సమయాన్ని 7 రోజుల 8 నిమిషాలకు పెంచే యోచనలో ఉంది. ఈ కొత్త ఫీచర్లన్నీ యూజర్ల వాట్సాప్ అకౌంట్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక, వీటితో పాటు వాట్సాప్ కొత్త ‘రియాక్షన్ నోటిఫికేషన్స్’ అనే ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను తొలుత ఆండ్రాయిడ్ v2.21.24.8 లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మెసేజ్ రియాక్షన్, రియాక్షన్ నోటిఫికేషన్ ఫీచర్లు రెండూ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. కంపెనీ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.