Home /News /technology /

WHATSAPP IS GETTING THESE NEW FEATURES SOON HERE DETAILS NS GH

WhatsApp: త్వరలోనే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్.. నోటిఫికేషన్‌ల్లో ఈ మార్పులు.. అవేంటంటే?

త్వరలోనే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్.. నోటిఫికేషన్‌ల్లో ఈ మార్పులు.. అవేంటంటే?

త్వరలోనే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్.. నోటిఫికేషన్‌ల్లో ఈ మార్పులు.. అవేంటంటే?

ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు మరో రెండు అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) నిత్యం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఇప్పుడు మరో రెండు అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా తాజాగా కొందరు ఐఓఎస్ వాట్సాప్ (iOS WhatsApp) యూజర్లకు ఈ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్‌లలో నోటిఫికేషన్‌లకు సంబంధించి రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ రిలీజ్ చేసినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. మొదటి ఫీచర్ అనేది సిస్టమ్ నోటిఫికేషన్‌ల్లో మెసేజ్ పంపిన అవతలి వ్యక్తి ప్రొఫైల్ ఫొటో(profile photo)లను చూపిస్తుంది. రెండో ఫీచర్ అనేది ఎవరైనా గ్రూపులో మీ మెసేజ్‌ను మెన్షన్ చేసినప్పుడు లేదా మెసేజ్‌కు రిప్లై ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని నోటిఫికేషన్‌లో చూపిస్తుంది. ఈ రెండు ఫీచర్లు వేర్వేరు అప్‌డేట్‌లలో విడుదలయ్యాయి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రాలేదు. అయితే త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్స్ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా మీరు గ్రూపులో పంపించిన మెసేజ్‌ను ఎవరైనా మెన్షన్ చేస్తే నోటిఫికేషన్‌లో ఆ సమాచారం కనిపించదు. అయితే ఆ సమాచారమంతా మరింత డీటెయిల్డ్ గా కనిపించేందుకు నోటిఫికేషన్‌ను రీడిజైన్ చేసి యూజర్లకి అప్‌డేట్ అందించింది వాట్సాప్. దీనివల్ల మీ మెసేజ్‌ను ఎవరు మెన్షన్ చేశారు లేదా ఎవరు రిప్లై ఇచ్చారు అనేది నోటిఫికేషన్ బార్ లోనే వీక్షించవచ్చు. అయితే ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌లకు మాత్రమే పనిచేస్తుంది. వ్యక్తిగత చాట్‌లకు పనిచేయదని గమనించాలి. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లలో ఐఓఎస్ డివైజ్‌లో ఈ రెండు ఫీచర్లు వర్క్ అవుతున్నట్టు చూడొచ్చు. ఈ అప్‌డేట్‌లు మునుపటి బీటా అప్‌డేట్‌ తరువాత యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బీటా అప్‌డేట్‌ అందించిన సమయంలో రీడిజైన్ చేసిన కాంటాక్ట్ ఇన్ఫో పేజీతో మరో అప్‌డేట్‌ వస్తుందని వాట్సాప్ సంస్థ వెల్లడించింది.
WhatsApp: అలర్ట్... ఈ 30 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... లిస్ట్ ఇదే

త్వరలోనే వాట్సాప్ ఐఫోన్ యూజర్లందరూ రాబోయే అప్‌డేట్‌లో మెసేజ్ నోటిఫికేషన్‌తో పాటు యూజర్ల ప్రొఫైల్ పిక్చర్స్ కూడా చూడగలరు. వాట్సాప్ బీటా ఇన్ఫో స్క్రీన్‌షాట్ ప్రకారం, కొత్త ఫీచర్ అనేది యూజర్లు ఒక వ్యక్తి లేదా గ్రూప్ నుంచి మెసేజ్ అందుకున్నప్పుడు నోటిఫికేషన్‌లో పంపినవారి వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ను చిన్న సైజులో చూసేందుకు అనుమతిస్తుంది. ఐఓఎస్ యూజర్లు కోసం వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.1.1ని విడుదల చేసిన వారం రోజుల తర్వాత ఈ రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకొచ్చాయి. ఈ బీటా వెర్షన్ యాప్‌లో యూజర్లు కమ్యూనిటీలను క్రియేట్ చేయడానికి అనుమతించే ఒక ఫీచర్ గురించి వెల్లడించింది. ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ లో ఇలాంటి ఫీచర్ ఇంతకు ముందు కనిపించింది.
WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు తిరుగులేని అధికారం... కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

నివేదికల ప్రకారం, వాట్సాప్‌లోని కమ్యూనిటీకి వాట్సాప్ గ్రూప్స్ మాదిరిగానే పేరు, డిస్క్రిప్షన్ ఉంది. పేరును క్రియేట్ చేసి డిస్క్రిప్షన్ రాసిన తర్వాత, యూజర్లు కొత్త గ్రూప్ క్రియేట్ చేసే లేదా 10 గ్రూప్స్ లింక్ చేసే ఆప్షన్ పొందుతారు. అడ్మిన్‌ల కోసం కమ్యూనిటీలో వాట్సాప్ ఆటోమేటిక్‌గా “అనౌన్స్‌మెంట్” గ్రూప్‌ని క్రియేట్ చేస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇది ఒకే మెసేజ్‌ని అన్ని లింక్ చేసిన గ్రూప్‌లకు ఒకేసారి షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Smartphone, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు