WhatsApp: వాట్సప్‌లో 'వెకేషన్ మోడ్'... త్వరలో వచ్చేస్తుంది

WhatsApp: వాట్సప్‌లో 'వెకేషన్ మోడ్'... త్వరలో వచ్చేస్తుంది (image: REUTERS)

WhatsApp “Vacation Mode” | మీరు మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్టు వాట్సప్‌ని ఆఫ్ చేయడమే 'వెకేషన్ మోడ్' ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు.

  • Share this:
    వాట్సప్... మోస్ట్ పాపులర్ యాప్. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ తప్పనిసరి అయిపోయింది. వాట్సప్ అవసరం అలాంటిది మరి. పర్సనల్ ఛాటింగ్, గ్రూప్స్, వీడియో కాలింగ్ ఇలా వాట్సప్‌తో ఎన్నో ఉపయోగాలు. అయితే ఒక్కసారి వాట్సప్ వాడకుండా మరుసటి రోజు ఆన్‌ చేస్తే కొన్ని వందల మెసేజ్‌లు ఉంటాయి. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చివరకు వెకేషన్‌లో ఉన్నా... వాట్సప్ మెసేజ్‌లు ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. అయితే కొంతకాలం పాటు మీరు వాట్సప్‌ను వాడకుండా ఉండేందుకు ఓ కొత్త ఫీచర్ రాబోతోంది. అదే 'వెకేషన్ మోడ్'. మొదట 'Vacation Mode' అని పేరు పెట్టారు కానీ... ఇప్పుడు 'Ignore archived chats' అని పేరు మార్చింది వాట్సప్.

    WhatsApp Vacation Mode, WhatsApp Ignore Archived Chats feature, whatsapp vacation mode android, whatsapp vacation mode,whatsapp new features, whatsapp tricks, whatsapp hidden features, new whatsapp features,whatsapp privacy, WhatsApp Tips and Tricks, వాట్సప్ వెకేషన్ మోడ్, వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ ట్రిక్స్, వాట్సప్ టిప్స్, వాట్సప్ ఫీచర్స్
    image: https://wabetainfo.com

    వాట్సప్ 'వెకేషన్ మోడ్' ఉపయోగాలు ఇవే...


    మీరు మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్టు వాట్సప్‌ని ఆఫ్ చేయడమే 'వెకేషన్ మోడ్' ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. వాట్సప్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలనుకునేవారి కోసం రూపొందిన ఫీచర్ ఇది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లు, ఆఫీస్ వర్క్‌లో కొంతకాలం బిజీగా ఉండేవాళ్లు, వెకేషన్‌కు వెళ్లే వాళ్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్నన్ని రోజులు మెసేజెస్ రావు. ఆఫ్ చేసిన తర్వాత మళ్లీ ఎప్పట్లాగే వాట్సప్ యాక్టీవ్ అవుతుంది. వాట్సప్ బీటా వర్షన్ 2.19.101 అప్‌డేట్ చేసినవారికి ఈ ఫీచర్ కనిపిస్తుంది. వాట్సప్ సెట్టింగ్స్‌లో 'Ignore archived chats' ట్యాబ్ కనిపిస్తుంది.

    Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

    IRCTC: రైలు టికెట్‌లో తప్పులుంటే ఇలా సరిచేసుకోండి

    PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు

    Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్
    First published: