Home /News /technology /

WHATSAPP IS BRINGING THIS PRIVACY FEATURE FOR ITS USERS UMG GH

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆన్‌లైన్ స్టేటస్ కూడా హైడ్ చేసే అప్‌డేట్..!

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల కోసం చక్కటి ప్రైవసీ ఫీచర్లను లాంచ్ చేస్తోంది. గతంలో లాస్ట్‌సీన్ (Last Seen) అనే ఫీచర్ పరిచయం చేసిన వాట్సాప్ ఆ తర్వాత అందులో కీలక మార్పులు తీసుకువచ్చింది.

ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల కోసం చక్కటి ప్రైవసీ ఫీచర్లను లాంచ్ చేస్తోంది. గతంలో లాస్ట్‌సీన్ (Last Seen) అనే ఫీచర్ పరిచయం చేసిన వాట్సాప్ ఆ తర్వాత అందులో కీలక మార్పులు తీసుకువచ్చింది. నచ్చిన వారికి మాత్రమే లాస్ట్‌సీన్ కనిపించేలా "మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్" ఆప్షన్ ఇటీవలే పరిచయం చేసింది. అయితే ప్రస్తుతానికి యూజర్లకు లాస్ట్‌ సీన్ హైడ్ చేయడం సాధ్యమైనా ఆన్‌లైన్ (Online) స్టేటస్‌ను హైడ్ (Hide) చేసుకునే సదుపాయం లేదు. దాంతో లాస్ట్‌ సీన్ మాత్రమే కాకుండా ఆన్‌లైన్ స్టేటస్‌ను కూడా తమ కాంటాక్ట్స్‌కి కనిపించకుండా చేసేలా ఓ ఆప్షన్ తీసుకురావాలని యూజర్లు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ సాయంతో మీరు ఆన్‌లైన్ ఉన్నా కూడా మీ కాంటాక్ట్స్‌కి మీరు ఆన్‌లైన్ ఉన్నట్లు తెలియకుండా చేయవచ్చు. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌ను మొదట iOS వెర్షన్‌లో WABetaInfo గుర్తించింది. ఇప్పుడు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కూడా కనిపించినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.16.12లో ఈ ఫీచర్‌ లాంచ్ అవుతుందని, ఆ తర్వాత వాట్సాప్ దీన్ని అందరికీ విడుదల చేసే అవకాశం ఉందని WABetaInfo పేర్కొంది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో కూడా WABetaInfo ఒక స్క్రీన్‌షాట్ ద్వారా వివరించింది. ఈ స్క్రీన్‌షాట్ ప్రకారం, ప్రైవసీ సెట్టింగ్స్‌లోని లాస్ట్‌సీన్ సెక్షన్‌లో హూ కెన్ సీ మై లాస్ట్‌సీన్ అనే ఆప్షన్ తో పాటు హూ కెన్ సీ వెన్ ఐయామ్ ఆన్‌లైన్‌ (Who Can See When I'm Online) అనే ఆప్షన్ కూడా చూడవచ్చు.



ఈ సెక్షన్‌లో మీరు మీ ఆన్‌లైన్‌ స్టేటస్ ఎవరెవరు చూడవచ్చో నిర్ణయించవచ్చు. ఈ స్టేటస్ అందరికీ కనిపించేందుకు ఎవ్రీవన్ (Everyone) అని ఎంచుకోవాలి. లాస్ట్ సీన్ లాగానే ఫలానా వారికి కనిపించకూడదు అనుకుంటే సేమ్ యాజ్‌ లాస్ట్ సీన్ (Same As Last Seen) ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనర్థం మీ లాస్ట్ సీన్‌ను మీ కాంటాక్ట్స్‌కి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకొని సేమ్ యాజ్‌ లాస్ట్ సీన్ అని ఎంచుకుంటే మీ కాంటాక్ట్స్‌కి మాత్రమే మీ ఆన్‌లైన్‌ స్టేటస్ కనిపిస్తుంది. అదే లాస్ట్‌సీన్‌ను Nobody అని సెలెక్ట్ చేసుకుని ఆన్‌లైన్‌ స్టేటస్‌ను సేమ్ యాజ్‌ లాస్ట్ సీన్ అని ఎంచుకుంటే... మీ ఆన్‌లైన్‌, లాస్ట్ సీన్ స్టేటస్ రెండూ ఎవరికి కనిపించవు. ఇంకా మిగతా ఆప్షన్లతో కూడా ఈ అప్‌కమింగ్ ఫీచర్‌తో మీ ఆన్‌లైన్‌ స్టేటస్‌ను మీ ఇష్టానుసారం హైడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా హైడ్ చేసుకునే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ల ప్రైవసీ చాలా పెరుగుతుంది.
Published by:Mahesh
First published:

Tags: New features, Tech news, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు