మెటా (గతంలో ఫేస్‌బుక్) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ (WhatsApp) తాజాగా వ్యూ వన్స్ (View Once) అనే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు పంపిన ఫోటోలు లేదా వీడియోలను అవతలి వ్యక్తి ఒకసారి మాత్రమే చూసేలా ఫీచర్ (Feature) పనిచేస్తుంది. అంటే మీరు పంపిన ఫోటోలు లేదా వీడియోలు సింగిల్ వ్యూతో వెంటనే డిలీట్ అయిపోతాయి. అంతేకాదు, అవి అవతలి వ్యక్తి గ్యాలరీలో కూడా సేవ్ అవ్వవు. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) రెండింటిలోనూ, వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు షేర్ చేసిన మెసేజ్ చాట్ బాక్సులో ఎప్పటికీ కనిపించకుండా ఉండాలంటే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఫోటో లేదా వీడియో పంపే ముందు ఒక ప్రాంప్ట్ మెసేజ్ (Forward Message) కనిపిస్తుంది. మీరు సెండ్ బార్‌లో కనిపించే 1 అనే బటన్‌పై క్లిక్ చేస్తే చాలు.. మీరు పంపిన ఫోటోలు అవతలి వ్యక్తి యూజర్ గ్యాలరీలో సేవ్ అవ్వవు. అయితే, మెసేజ్ పంపడానికి ముందే ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒక్కసారి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత ఫార్వర్డ్, సేవ్, స్టార్, షేర్ (Share) చేయడం కుదరదు. ఒకవేళ మీరు పంపిన ఫోటో లేదా వీడియోను అవతలి వ్యక్తి 14 రోజుల్లోపు ఓపెన్ చేయకుండా ఉంటే దానంతట అదే డిలీట్ అయిపోతుంది. మీ చాట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్‌ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
వ్యూవన్ ఫీచర్‌ను ఇలా సెట్ చేసుకోండి..
1. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ (Update) చేసుకోండి.
2. మీరు పంపాల్సిన ఫోటో లేదా వీడియోను ఎంచుకోండి.
3. మీ కాంటాక్టుల్లో ఎవరికి ఒకసారి మాత్రమే మెసేజ్ కనిపించాలో ఎంచుకోండి. ఆ తర్వాత, క్యాప్షన్ బార్ పక్కన ఉన్న 'వ్యూ వన్స్' సింబల్‌పై క్లిక్ చేయండి. మీకు ఒక అలర్ట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. వ్యూ వన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలా? అని ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తుంది.
చదవండి - Microsoft Features: మైక్రోసాఫ్ట్‌లో కొత్త ఫీచర్.. మైక్రోసాఫ్ట్‌లో ఎకౌంట్ ఇక మరింత సేఫ్
4. అప్పుడు మెసేజ్ సెండింగ్ ఐకాన్‌కు ముందు కనిపించే 1 బటన్ నొక్కితే చాలు.. మీరు ఎంచుకున్న కాంటాక్టులకు ఫోటో లేదా వీడియో (Video) సెండ్ అవుతుంది.
యూజర్ ప్రైవసీని మెరుగుపర్చడానికి ఈ కొత్త ఫీచర్ (Feature) ను తీసుకొచ్చినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫోటోలు, వీడియోలకు ప్రైవసీ ఉండాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఫీచర్‌లో ఒక లోపం ఉంది. మీరు పంపిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేయలేకపోయినా, అవతలి వ్యక్తి స్క్రీన్‌షాట్ (Screen Shot) తీసుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.