Home /News /technology /

WHATSAPP INTRODUCING TWO NEW FEATURES FOR ANDROID IOS USERS KNOW DETAILS GH EVK

WhatsApp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు.. అవేంటి? ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Whatsapp Features: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను సంస్థ పరిచయం చేస్తోంది. అవేంటో తెలుసుకొందాం

వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల (Features)తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను సంస్థ పరిచయం చేస్తోంది. యూజర్లు (Users) తమ లాస్ట్ సీన్, స్టేటస్ (Status), ప్రొఫైల్ ఫోటోను నిర్దిష్ట కాంటాక్ట్‌ల నుంచి హైడ్ చేసే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతోపాటు వినియోగదారులు వారి వాయిస్ నోట్‌ని పంపే ముందు వినగలిగే మరో ఫీచర్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం బీటా దశలో ఉన్నాయని చెబుతోంది వాట్సాప్ ట్రాకర్, వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ అయిన వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo). వీటిని త్వరలో రిలీజ్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తమ ప్లాట్‌ఫాంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రైవసీ ఫీచర్‌ (Privacy Features)లను వాట్సాప్ మరింత అప్‌గ్రేడ్ చేస్తోంది. లాస్ట్ సీన్, స్టేటస్, ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేసే ఫీచర్ ఇదివరకే ఉంది. ఇప్పటి వరకు వాట్సాప్ వినియోగదారులు వారి లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో (Profile Photo), అబౌట్ ఇన్‌ఫోను.. ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ అనే మూడు ఆప్షన్లతో కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు అదనంగా వీటికి ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ట్యాబ్ జత కానుంది. దీని ద్వారా నిర్ధిష్ట కాంటాక్ట్స్‌కు తమ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా యూజర్లు హైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ రెండింటి బీటా వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ప్రైవసీ సెట్టింగ్స్‌కు జోడించే ఈ కొత్త అప్షన్ స్క్రీన్‌షాట్‌ను WABetaInfo షేర్ చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలిపింది.

వాయిస్ మెసేజ్ ప్రివ్యూ..
వాట్సాప్ త్వరలో వాయిస్ మెసేజ్‌ (Voice Message)లను ప్రివ్యూ చేయడంతో పాటు పాజ్ చేసే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్ యాప్ వినియోగాన్ని మరింతగా మెరుగుపరుస్తుందని సంస్థ భావిస్తోంది.

Twitter Videos: ట్విట్ట‌ర్‌లో వీడియో న‌చ్చిందా.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా? అయితే తెలుసుకోండి


ఈ ఫంక్షనాలిటీ అప్‌డేట్ (Update) అయిన తర్వాత మీరు వాయిస్ మెసేజ్‌ని ఎవరికైనా సెండ్ చేయటానికి ముందే పాజ్ చేసి, వినవచ్చు. ఇదివరకు వాట్సాప్‌లో వాయిస్ నోట్‌ రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్ కాకపోయేది. దాంతో పాటు వాయిస్ నోట్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ తరంగ రూపాలను కూడా చూపుతుంది. ఈ కొత్త ఫీచర్ (New Features) సైతం ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో బీటా టెస్టింగ్ కోసం ఇప్పటికీ అందుబాటులో ఉంది.

ఇందులో ఆడియో రికార్డింగ్ అప్షన్ ను లాక్ (Lock) చేయడానికి దాన్ని పైకి స్లైడ్ చేయాలి. అలా మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడియో బటన్‌పై మీ వేలును ఉంచాల్సిన అవసరం ఉండదు. రికార్డింగ్ (Record) ప్రారంభించిన తర్వాత మీ ఆడియోను రికార్డ్ చేయండి. పూర్తయిన తర్వాత వాట్సాప్ హోమ్‌పేజీకి తిరిగి రావడానికి బ్యాక్ బటన్‌ను ప్రెస్ చేయండి. ఈ సమయంలో ఆడియో రిలీజ్ కాకుండా జాగ్రత్త వహించాలి. బ్యాక్ బటన్‌ను ప్రెస్ గురించి ఆందోళన అవసరం లేదు.. ఎందుకంటే దాని వల్ల మీ ఆడియో ప్రభావితం కాదు. మీరు ఆడియోను షేర్ చేయాలనుకుంటున్న రికార్డింగ్ కు తిరిగి వెళ్లండి. అక్కడే ఆడియో మీ కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ క్లిప్‌ను ప్లే చేసి విన్న తరువాత.. అంతా కరెక్ట్ గా ఉన్నట్లు అనిపిస్తేనే సెండ్ బటన్‌ను నొక్కండి. మీరు మీ ఆడియో(Audio)ను మళ్లీ రికార్డ్ చేయాలనుకుంటే ట్రాష్ (Trash) బటన్ ను నొక్కి డిలీట్ చేయవచ్చు.
Published by:Sharath Chandra
First published:

Tags: Latest Technology, New feature, Social Media, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు