Whatsapp Future: వాట్స‌ప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. వాయిస్ మెసేజ్ ఇక‌ సుల‌భం

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్స్ (WhatsApp New Features) రిలీజ్ చేసేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. వాట్సప్ తమ యూజర్లకు ఎప్పుడూ కొత్తకొత్త ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. ఇందులో వాయిస్‌ మెసేజ్‌ సర్వీస్‌లకు మరో అద్బుతమైన ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్‌ చేయనుంది.

  • Share this:
    వాట్సప్ (WhatsApp )యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్స్ (New Features) రిలీజ్ చేసేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. వాట్సప్ తమ యూజర్లకు ఎప్పుడూ కొత్తకొత్త ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. ప్రతీ నెలా కొత్తకొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. వాటిలో చాలావరకు ఫీచర్స్ యూజర్లకు ఉపయోగపడేవే. అలాంటి ఫీచ‌రే వాట్స‌ప్ మ‌రోక‌టి వినియోగదారుల‌కు ఉపయోగ ప‌డే ఫీచ‌ర్ అందిస్తోంది. అలాంటి ఫీచ‌రే తాజాగా వాట్సాప్‌ యాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ సర్వీస్‌లకు మరో అద్బుతమైన ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్‌ చేయనుంది. మనం వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లను పంపిస్తూ ఉంటాం. వాయిస్‌ మెసేజెస్‌ను స్పీకర్‌ ఐకాన్‌పై ప్రెస్‌ చేసి మెసేజ్‌లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం.

    స్పీకర్‌ (Speaker) ఐకాన్‌పై ఆన్‌ప్రెస్‌ చేయగానే వాయిస్‌ మెసేజ్‌ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది. వాయిస్‌ మెసేజ్‌ రికార్డు చేసే సమయంలో మెసేజ్‌లను ‘పాజ్‌’ చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్‌ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్‌ మెసేజ్‌ రికార్డు విషయంలో కొత్తగా పాజ్, ప్లే బటన్లను వాట్సాప్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

    Twitter Features : ట్విట్టర్​లో కొత్తగా సాఫ్ట్​ బ్లాక్​ ఫీచర్​.. ఫాలోవర్లను బ్లాక్ చేయకుండానే తొలగించే అవకాశం


    అంతేకాకుండా డిలీట్ , సెండ్‌ బటన్‌ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్‌తో మనకు నచ్చిన అప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. WABetainfo ప్రకారం... ఈ కొత్త ఫీచర్‌ త్వరలోనే వాట్సాప్‌ బెటా ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ (Android) యూజర్లకు అందుబాటులో ఉండనుంది.

    ఫీచర్స్ యూజర్లకు ఉపయోగపడేవే. ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్స్‌ని (WhatsApp latest features) వాట్సప్ రిలీజ్ చేయబోతోంది. మెసేజ్ రియాక్షన్స్, ఛాట్ బబుల్స్, కాంటాక్ట్ కార్డ్, ఎడిటింగ్ టూల్స్, పేమెంట్ షార్ట్‌కట్ లాంటి ఫీచర్స్‌ని అందించబోతోంది. మరి ఈ ఫీచర్స్ మీకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

    Message Reactions: ఐమెసేజ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ ఉంది. త్వరలో వాట్సప్‌లో కూడా ఈ ఫీచర్ రాబోతోంది. మీరు ఏదైనా మెసేజ్‌కు రిప్లై ఇవ్వొద్దనుకుంటే రియాక్ట్ కావొచ్చు. గ్రూప్ ఛాట్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజెస్‌కు మీ రియాక్షన్ ఇవ్వొచ్చు.

    Whatsapp : వాట్స‌ప్ ఖాతా ఎందుకు బ్లాక్ అవుతుందో తెలుసా.. చ‌ద‌వండి


    Chat bubbles: ఛాట్ బబుల్స్‌కు కొత్త లుక్ తీసుకురానుంది వాట్సప్. యూజర్లు ఎక్కువ సమయం వాట్సప్ ఛాట్ విండోస్ ఉపయోగిస్తుంటారు కాబట్టి యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగుపర్చేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. గ్రీన్ బబుల్స్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌ (Intresting)గా మార్చనుంది.

    Contact card: ఆండ్రాయిడ్‌లో కాంటాక్ట్ కార్డుకు మరిన్ని మెరుగులు దిద్దుతోంది వాట్సప్. ప్రస్తుతం ఫోటో మాత్రమే కనిపిస్తుంది. త్వరలో డిజైన్డ్ కార్డ్ కనిపించబోతోంది. డిజైన్డ్ కార్డ్‌లో కాల్స్, టెక్స్‌ట్, వీడియో కాల్స్ డైరెక్ట్‌గా చేసుకోవచ్చు.

    Photo editing tools: వాట్సప్‌లో ఫోటోలు ఎడిట్ చేసేందుకు ఫోటో ఎడిటర్ టూల్ అందుబాటులోకి రానుంది. యూజర్లు ఫోటోలపై స్టిక్కర్స్, టెక్స్‌ట్, ఎమోజీస్ యాడ్ చేయొచ్చు. ఫోటోస్ క్రాప్ చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published: