WhatsApp Stickers: మరో రెండు స్టిక్కర్ ప్యాక్‌లను విడుదల చేసిన వాట్సాప్.. వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి

వాట్సప్ నుంచి కొత్త స్టిక్కర్లు.. వివరాలు ఇక్కడ చూడండి (PC: Cashify)

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్.. తాజాగా రెండు రకాల స్టిక్కర్ ప్యాక్‌లను ప్ర?

  • Share this:
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. తాజాగా రెండు రకాల స్టిక్కర్ ప్యాక్‌లను (Sticker Pack) ప్రవేశపెట్టింది. హౌజాట్ (Howzat), వియర్డ్ ఈజ్ వండర్‌ఫుల్ (Weird is wonderful) పేరుతో వాటిని విడుదల చేసింది. హౌజాట్ ప్యాక్‌లో క్రికెట్‌కు (Cricket) సంబంధించిన వివిధ స్టిక్కర్లు ఉంటాయి. క్రికెట్ సీజన్‌కు తగ్గట్లు చాట్ లిస్ట్ సంభాషణల్లో వీటిని ఉపయోగించవచ్చు. వివిధ రకాల క్రికెట్ థీమ్డ్ స్టిక్కర్లను యూజర్లు సెండ్ చేయవచ్చు. హౌజాట్‌తో పాటు ప్రారంభించిన ‘వియర్డ్ ఈజ్ వండర్‌ఫుల్’ ప్యాక్‌లో.. వ్యక్తులు, పనులకు సంబంధించిన వివిధ రకాల యానిమేటెడ్ స్టిక్కర్లు ఉన్నాయి. ‘మీ విచిత్రాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఇది మీ చాట్‌లను అద్భుతంగా మారుస్తుంది’ అని ఈ స్టిక్కర్ ప్యాక్ సేల్స్ డిస్క్రిప్షన్‌లో రాశారు.

కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను సులభంగా వాట్సాప్ చాట్‌లో ఉపయోగించవచ్చు. వీటిని ప్రయత్నించడానికి ముందు ఒక కాంటాక్ట్‌ను ఎంచుకొని, టైప్ బాక్స్‌లో ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడమవైపు ఉన్న ఎమోజీ ఐకాన్‌పై క్లిక్ చేయండి. తరువాత కిందివైపు ఉండే స్టిక్కర్ లోగోపై క్లిక్ చేయండి. ఇది స్మైలీ, GIFల పక్కన ఉంటుంది. అనంతరం బాక్స్ కుడివైపు పై మూలలో "+" గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. దీని తరువాత.. అవసరమైన స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయడానికి ముందు వాటిని ప్రివ్యూ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.








View this post on Instagram






A post shared by WhatsApp (@whatsapp)






వాట్సాప్ గతంలో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే వీటికి యూజర్లు తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని వాట్సాప్ చెబుతోంది. క్లౌడ్ ప్రొవైడర్‌లను ఉపయోగించే బిజినెస్ అకౌంట్‌లకు మెసేజ్‌లు పంపాలనుకుంటున్న యూజర్లు మాత్రమే కొత్త పాలసీలను రివ్యూ చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వివాదం తరువాత పోటీ సంస్థల మెసేజింగ్ యాప్స్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. దీంతో యూజర్లు చేజారిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. ఈ సంస్థ త్వరలోనే మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ పోస్ట్‌లలో ఉండే యాడ్ రియాక్షన్స్‌ ఫీచర్‌ను త్వరలో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది.

Paralympics: పారాలింపిక్స్‌లో కొనసాగుతున్న భారత పతకాల వేట.. నేడు మూడు పతకాలు సాధించిన అథ్లెట్లు


 

Published by:John Naveen Kora
First published: