WHATSAPP INTRODUCED NEW FEATURE TO ALLOW USERS TO MAKE THEIR OWN CUSTOM STICKERS NS GH
WhatsApp Web: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. స్టిక్కర్లను స్వయంగా డిజైన్ చేసుకునే ఛాన్స్.. ఎలాగంటే?
ప్రతీకాత్మక చిత్రం
వాట్సాప్(WhatsApp) ప్లాట్‌ఫారమ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా స్టిక్కర్లు (Whatsapp Sticker) అందుబాటులో ఉన్నప్పటికీ.. సొంతంగా స్టిక్కర్లను తయారు చేసుకునే వెసులుబాటు ఉండేది కాదు. ఇప్పుడు వాట్సాప్‌లోనే స్వయంగా స్టిక్కర్లను తయారుచేసుకునే అవకాశం కలిగింది.
మెటా-Meta (గతంలో Facebook) యాజమాన్యంలోని ఇన్స్టన్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్(Whatsapp) యూజర్లను ఆకట్టుకునేలా కొత్త ఫీచర్లను (Features) తీసుకొస్తుంది. ఇదే తరహాలో ఇప్పుడు ఓ అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే కస్టమ్ స్టిక్కర్ (Whatsapp Sticker) మేకర్ ఫీచర్. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరే స్వయంగా స్టిక్కర్లను (Whatsapp Custom Sticker Maker) తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, వాటిని ఇతరులకు పంపుకోవచ్చు. స్టిక్కర్ డిజైన్ కోసం వాట్సాప్ ఓ కొత్త టూల్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ టూల్‌ను కేవలం డెస్క్‌టాప్ (Desktop) ప్లాట్‌ఫారమ్‌పై మాత్రమే ఉపయోగించవచ్చు. ఇది వచ్చే వారం నుంచి డెస్క్‌టాప్ యూజర్లకు ఇది అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా స్టిక్కర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సొంతంగా స్టిక్కర్లను తయారు చేసుకునే వెసులుబాటు ఉండేది కాదు. గతంలో స్టిక్కర్లను తయారు చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు వాట్సాప్‌లోనే స్వయంగా స్టిక్కర్లను తయారుచేసుకునే అవకాశం కలిగింది. కాగా, వాట్సాప్ ప్రస్తుతానికి పీసీ, మ్యాక్ యూజర్ల కోసం ఈ స్టిక్కర్ మేకర్ టూల్‌ను ప్రకటించింది. అయితే ఇది ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఈ ఫీచర్‌ని వెంటనే ఉపయోగించడానికి మీరు వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. WhatsApp Chat Leaks: మీ వాట్సప్ ఛాట్స్ లీక్ అవుతున్నాయని డౌటా? ఈ టిప్స్ పాటించండి
వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా తయారు చేసుకోవాలి? -ముందుగా వాట్సాప్ వెబ్‌ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ వాట్సాప్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
-ఇప్పుడు మీరు స్టిక్కర్‌ను పంపాలనుకుంటున్న కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఓపెన్ చేయండి.
-ఆ తర్వాత చాట్ బార్‌లోని అటాచ్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఆపై స్టిక్కర్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
-అటాచ్ బటన్ ద్వారా కొత్త స్టిక్కర్ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత, మీ కంప్యూటర్లో సేవ్ చేసిన ఏదైనా ఫోటోను ఎంచుకోండి. మీరు స్టిక్కర్‌గా పంపాలనుకుంటున్న ఫోటోను ఎంచుకుని, స్టిక్కర్ టూల్‌ను ఉపయోగించి కొత్త స్టిక్కర్‌ను తయారు చేసుకోండి. WhatsApp: కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్.. ఆడియో మెసేజెస్ ప్లేబ్యాక్ స్పీడ్‌ని సర్దుబాటు చేసుకునే అవకాశం
-మీ స్టిక్కర్ ప్యానెల్ నుంచి ఎమోజీలు, స్టిక్కర్లను జోడించడానికి కూడా వాట్సాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. యూజర్లు ఆయా చిత్రాలపై గీయవచ్చు లేదా ఎడిట్ చేయవచ్చు.
-కస్టమ్ స్టిక్కర్‌ని విజయవంతంగా ఎడిట్ చేసి, క్రియేట్ చేసిన తర్వాత, మీ చాట్ స్క్రీన్కు కుడివైపున ఉన్న సెండ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ స్టిక్కర్‌ను ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ తెరిచి పంపించండి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.