హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఆ ఫీచర్ వచ్చేసింది

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఆ ఫీచర్ వచ్చేసింది

https://wa.me/<phone_number> రూపంలో గూగుల్ సెర్చ్‌లో ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నాయని తెలిపారు.

https://wa.me/<phone_number> రూపంలో గూగుల్ సెర్చ్‌లో ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నాయని తెలిపారు.

WhatsApp | యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది వాట్సప్. ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌తో ఎక్కువగా వీడియోకాల్స్ చేస్తుంటారా? స్నేహితులతో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతుంటారా? అయితే మీకు శుభవార్త. వాట్సప్‌లో ఒకేసారి నలుగురితో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా కాన్ఫరెన్స్ కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎంత ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటే అంత మేలన్న అభిప్రాయం యూజర్లలో ఉంది. అందుకే ఎక్కువ పార్టిసిపెంట్స్‌కు అవకాశం ఉండే యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల గూగుల్ డ్యూయో ఇప్పటికే వీడియో కాల్ యాక్టీవ్ యూజర్ల సంఖ్యను 12 చేసింది. అయితే వాట్సప్‌లో మాత్రం కేవలం నలుగురు పార్టిసిపెంట్స్‌కి మాత్రమే అవకాశం ఉండటం పెద్ద లోటే. యూజర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించిన వాట్సప్... గ్రూప్ కాల్ లిమిట్‌ను 4 నుంచి 8 చేసింది. అంటే మీరు మీ వాట్సప్‌లో గ్రూప్ కాల్స్ చేస్తే ఒకేసారి 8 మందిని యాడ్ చేయొచ్చు.

గ్రూప్ కాల్ పార్టిసిపెంట్స్ సంఖ్యను 4 నుంచి 8 కి పెంచుతూ ఈ కొత్త ఫీచర్‌ని యూజర్లకు అందిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు ఈ అప్‌డేట్ రిలీజ్ చేసింది వాట్సప్. ఒకవేళ మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సప్‌ 2.20.133 వర్షన్‌ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్‌ను భారతదేశంలోని 40 కోట్ల మంది యూజర్లకు అందించనుంది. అయితే ఇప్పటికే నలుగురు పార్టిసిపెంట్స్‌తో వీడియో, ఆడియో కాల్స్‌లో సమస్యలు ఉన్నాయని పలువురు యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. గత నెలలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వీడియో కాల్స్ చేసినవారి సంఖ్య 70 శాతం పెరిగింది. వాట్సప్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ఇవి కూడా చదవండి:

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా

First published:

Tags: Technology, Whatsapp

ఉత్తమ కథలు