మెటా (Meta) యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సాప్ (WhatsApp) కంపెనీ వరుస అప్‌డేట్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్లను సొంతం చేసుకుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో టాప్ ప్లేస్‌లో రన్ అవుతోంది. ఎప్పటికప్పుడు యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కొత్త కొత్త ఫీచర్ల (New Features)ను తీసుకుస్తోంది. ఇప్పుడు తాజాగా iOS యూజర్లకు తాజాగా ఓ అప్‌డేట్ అందజేసింది. ఆ ఆప్‌డేట్ వివరాలు ఏంటి? వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం?
* అవతార్‌లు క్రియేట్ చేసుకొనే ఫీచర్
వాట్సాప్ తాజాగా అందించనున్న ఫీచర్ ద్వారా పర్సనలైజ్డ్ అవతార్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాటిని స్టిక్కర్‌లు, ప్రొఫైల్ పిక్చర్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
కొంత మంది ఐవోఎస్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఇంతకుముందు అందించిన వాట్సాప్ అప్‌డేట్‌లోనే పొంది ఉండవచ్చు. కానీ ప్రస్తుతం కంపెనీ రిలీజ్ చేసిన అప్‌డేట్ ద్వారా ఎక్కువ మందికి పర్సనలైజ్డ్ అవతార్‌లను క్రియేట్ చేసే అవకాశం లభిస్తుందని WABetaInfo ఓ నివేదికలో పేర్కొంది.
వినియోగదారులు తమ వాట్సాప్ అకౌంట్‌కు ఈ లేటెస్ట్ ఫీచర్ అందిందో? లేదో? అనే అంశాన్ని వాట్సాప్ సెట్టింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తాజా అప్‌డేట్‌లో వాట్సాప్ కెమెరా లోపల ఎడమవైపుకి స్వైప్ చేయడం ద్వారా హ్యాండ్స్-ఫ్రీగా వీడియోలను రికార్డ్ చేసే సామర్థ్యాన్ని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇంట్రడ్యూస్ చేసింది. వినియోగదారులు తాజా అప్‌డేట్‌లో కొన్ని సెకన్లలో డిలీట్ ఫర్ మీ ఆప్షన్‌ను అన్‌డూ చేసే ఫీచర్‌ను కూడా పొందుతారు.
రాబోయే అప్‌డేట్స్‌లో యూజర్లు తమ కాంటాక్ట్స్ లిస్ట్‌ను త్వరగా యాక్సెస్ చేసేందుకు, త్వరగా కాల్ చేసేందుకు ఉపయోగపడేలా కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ అందించనుందని WABetaInfo తెలిపింది. ఎక్కువగా కాల్ చేసే వారి కాంటాక్ట్ నంబర్‌ను షార్ట్‌కట్‌గా సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మెసేజ్‌లు పంపినంత సులువుగా యూజర్లు కాల్ కూడా చేసుకోవాలనే లక్ష్యంతా వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఇది కూడా చదవండి : భారీగా ఉండనున్న ఐఫోన్ 15 సిరీస్ ధరలు? తాజా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే?
* ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసే ఆప్షన్
మరికొందరు వాట్సాప్ యూజర్లు రాబోయే వారాల్లో కొన్ని కొత్త ఫీచర్‌లను అందుకునే సూచనలు ఉన్నాయని WABetaInfo నివేదిక పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ కంపెనీ చాట్‌లు, గ్రూప్‌లలో మెసేజ్‌లను పిన్ చేసే సదుపాయాన్ని వినియోగదారులకు అందించే ప్రయత్నాల్లో ఉందని వివరించింది. దీని ద్వారా వినియోగదారులు ముఖ్యమైన మెసేజ్‌లను విండో టాప్‌లో పిన్ చేసుకోవచ్చని, ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని WABetaInfo నివేదిక తెలిపింది.ఒకవేళ మెసేజ్ పిన్ చేసినప్పుడు రిసీవింగ్ ఎండ్‌లోని యూజర్ ఓల్డ్ వెర్షన్ వాట్సాప్‌ను వినియోగిస్తుంటే.. స్టోర్‌లో అందుబాటులో ఉన్న తాజా వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయమని నోటిఫై చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Tech news, Whatsapp