WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్‌లను ఇలా తెలుసుకోవచ్చు..

WhatsApp: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత దగ్గరవుతున్న ఈ మెసేజింగ్ యాప్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై దృష్టి సారించింది. ఎక్కువ సార్లు ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయితే.. ఆ మెసేజ్‌‌ డబుల్ బాణం గుర్తుతో కనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 6:46 PM IST
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్‌లను ఇలా తెలుసుకోవచ్చు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఫేక్ న్యూస్‌లను అరికట్టేందుకు వాట్సాప్ మరో ముందడుగు వేసింది. కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత దగ్గరవుతున్న ఈ మెసేజింగ్ యాప్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై దృష్టి సారించింది. ఎక్కువ సార్లు ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయితే.. ఆ మెసేజ్‌‌ డబుల్ బాణం గుర్తుతో కనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తోంది. ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్’ అనే ఈ ఫీచర్‌ను భారత్‌లోనే తొలుత అందుబాటులోకి రానుంది. అదే మెసేజ్‌ను యూజర్ ఫార్వర్డ్ చేస్తే నోటిఫికేషన్ కూడా వచ్చేలా యాప్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ తర్వలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఏదేని ఒక మెసేజ్‌ను ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేస్తే డబుల్ బాణం గుర్తు కనిపిస్తుంది.

ఇక, భారీ, పొడవైన మెసేజ్‌లు పంపితే అవి యూజర్‌కు పూర్తి కనిపించవు. పూర్తి మెసేజ్ చదవడానికి వాట్సాప్ సంస్థ ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మారుతుందని, ముఖ్యంగా గ్రూప్ చాట్‌లలో ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్‌కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 2, 2019, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading