Home /News /technology /

WHATSAPP GROUP VIDEO CALLS GET MORE FEATURES UMG GH

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. వీడియో కాల్‌లో మస్తు మజా.. ఇకపై ఆ గోల అస్సలుండదు

వాట్సాప్‌ వీడియో కాల్‌లో కొత్త ఫీచర్.

వాట్సాప్‌ వీడియో కాల్‌లో కొత్త ఫీచర్.

వాట్సాప్‌ (WhatsApp) ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్స్ చేసే అడ్మిన్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్‌ను (Feature) లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో వీడియో కాల్ (Video Call) హోస్ట్‌ చేసే యూజర్ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తిని మ్యూట్ (Mute) చేయవచ్చు.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌రియన్స్‌ను మరింత అద్భుతంగా మార్చేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అలాగే ఇప్పటికే ఉన్న వాయిస్ మెసేజెస్, ఫైల్ షేరింగ్ వంటి ఫెసిలిటీలలో కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వాటిని మరింత మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్ వీడియో కాలింగ్ (Group Video Calling) ఫెసిలిటీకి కూడా వాట్సాప్ మరిన్ని హంగులు దిద్దుతోంది. ఈ క్రమంలోనే మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్ వీడియో కాల్స్ చేసే అడ్మిన్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో వీడియో కాల్ హోస్ట్‌ చేసే యూజర్ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తిని మ్యూట్ (Mute) చేయవచ్చు. అంతేకాదు, కాల్ కొనసాగుతున్నప్పుడు తమ కాల్‌లో పాటిస్పేట్ చేసిన ఇతరులకు వ్యక్తిగతంగా మెసేజ్ (Individual Message) పంపవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్‌ల కోసం ఈ ఫీచర్‌ను వాట్సాప్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ రోల్అవుట్ క్రమంగా దశలవారీగా జరుగుతుంది కనుక అందరికీ అందుబాటులోకి వచ్చేలోపు కొంత సమయం పట్టొచ్చు. ఈ ఫీచర్ ఏంటి, ఇదెలా హెల్ప్ అవుతుందనే వివరాలను గురువారం వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్లు రిలీజ్ అవుతోందని, ఈ ఫీచర్‌తో ఇప్పుడు గ్రూప్‌ వీడియో కాల్‌లో ఉన్న ఏ యూజర్‌నైనా మ్యూట్ చేయవచ్చని, అలానే ఏ యూజర్‌కైనా పర్సనల్ మెసేజ్ పంపించవచ్చని క్యాత్‌కార్ట్ పేర్కొన్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని కూడా ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఫుల్ డీటైల్స్ ఇవిగో!


ఈ ఫీచర్ ఎప్పుడు ఉపయోగపడుతుందో కూడా ఆయన చెప్పారు. గ్రూప్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు కొందరు ఒక్కోసారి మ్యూట్ చేయడం మర్చిపోయి వేరే పనిలో మునిగి పోతుంటారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందిగా అనిపించొచ్చు. మీటింగ్‌కు అంతరాయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే మ్యూట్ చేయడం మర్చిపోయిన వారి ప్రైవసీకి కూడా భంగం వాటిల్లుతుంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకే తాజాగా వాట్సాప్ వీడియో కాల్ హోస్ట్‌కు కొత్త ఫీచర్ తీసుకొస్తోందని వాట్సాప్ హెడ్ విల్ అన్నారు. వాట్సాప్ మరెన్నో అద్భుతమైన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్లతో ఇప్పుడు జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా మారింది. ఆఫీసు, వ్యక్తిగత, ఇతర వర్చువల్ మీటింగ్స్ కోసం చాలామంది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌పైనే ఆధారపడుతున్నారంటే అతిశయోక్తి కాదు.



వాట్సాప్ రీసెంట్ టైమ్స్‌లో చాలా ఫీచర్లను లాంచ్ చేసింది. ఎమోజీ రియాక్షన్లు, ఆడియో నోట్స్‌లో కొత్త ఫీచర్లు, మల్టీ డివైజ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ టు ఐఓఎస్‌కి వాట్సాప్ డేటా హిస్టరీని అఫీషియల్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫెసిలిటీని అందించింది. ఈ ఏడాదిలో 2జీబీ ఫైల్ షేరింగ్ లిమిట్, సీక్రెట్‌గా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యే ఆప్షన్, మెసేజ్ ఎడిటింగ్, కమ్యూనిటీస్‌, పోల్స్, చాట్ ఫిల్టర్స్, డిలీటెడ్ మెసేజెస్‌ను రిస్టోర్ చేసే బటన్ లాంటి ఫీచర్లు కూడా రిలీజ్ కానున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Group call, New features, Tech news, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు