WhatsApp: మీకు ఇష్టం లేకున్నా వాట్సాప్ గ్రూపులో చేరుస్తున్నారా..?

WhatsApp New Features: నాలుగు కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింత దగ్గర అయ్యేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ‘గ్రూప్’ సమస్యను అధిగమించేందుకు ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 19, 2019, 10:38 AM IST
WhatsApp: మీకు ఇష్టం లేకున్నా వాట్సాప్ గ్రూపులో చేరుస్తున్నారా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సాప్.. మెసేజ్‌ల ఖర్చులు లేకుండా చేసి కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది భారత వినియోగదారులను ఆకట్టుకున్న మెసేజింగ్ యాప్ ఇది. మెసేజ్ డెలివరీ అయ్యిందా? లేదా? అయితే ఎప్పుడు అయ్యింది? ఆ మెసేజ్‌ను చూశారా? రిప్లై ఇస్తున్నారా? ఆన్‌లైన్‌లో ఉన్నారా? తదితర ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించింది. ఆ తర్వాత కూడా వినియోగదారులకు సౌలభ్యంగా ఉండేలా మరెన్నో ఫీచర్లను, ఎమోజీలను ప్రవేశపెట్టింది. రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్లతో, హంగులతో వరల్డ్ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ‘గ్రూప్’ సమస్యను అధిగమించేందుకు ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్ చేసిన గ్రూప్‌లో చేరిపోతుంటాం. ఇది కొందరికి విసుగ్గా ఉంటోంది. మనకు ఇష్టం లేకున్నా గ్రూప్‌లో చేరుస్తుండటం.. మనం లెఫ్ట్ అవుతుండటం.. జరుగుతోంది.

దీన్నుంచి స్వాంతన చేకూర్చేందుకు కొత్తగా ప్రైవసీ సెట్టింగ్‌ మార్చుకోవచ్చు. మనం అనుమతి ఇస్తేనే గ్రూప్‌లో చేరేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఆహ్వానం వచ్చిన 72 గంటల్లో దాన్ని ఓకే చేయాలి. లేకపోతే గ్రూప్‌లో చేరే అవకాశం ఉండదు. అలాగే నంబరును వాట్సాప్ గ్రూపుల్లో చేర్చవద్దు అనే యాప్షన్ కూడా ఉంది. వేలిముద్ర సహాయంతో వాట్సాప్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించింది. స్పామ్ మెసేజ్‌లను గుర్తించేందుకు ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. ఒకేసారి అనేక వాయిస్ మెసేజ్‌లను వరుసగా వినే అవకాశాన్ని కూడా వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 19, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading