వాట్సప్‌లో త్వరలో గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వచ్చిందంటే ఇకపై మిమ్మల్ని ఎవరైనా తమ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ తప్పనిసరి. వాట్సప్ గ్రూప్స్ చాలామంది యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారిందన్నది వాస్తవం. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు గ్రూప్‌లో యాడ్ చేస్తూనే ఉంటారు. ఆ గ్రూప్‌లో కొనసాగాలో, ఎగ్జిట్ కావాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు యూజర్లు. కానీ 'గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్'తో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు అనుమతి ఇస్తే తప్ప మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయడం సాధ్యం కాదు. 2.19.55 వర్షన్ వాట్సప్ అప్డేట్ చేసినవాళ్లు 'గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్' వాడుకోవచ్చని WABetaInfo తాజాగా వెల్లడించింది.
Read this:
పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
WhatsApp Settings > Account > Privacy > Groups సెక్షన్లో మీకు మూడు ఆప్షన్స్ Everyone, My Contacts, Nobody అని కనిపిస్తాయి. ఇందులో ‘Everyone’ ఎంచుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు. కేవలం ‘My Contacts’ ఎంచుకుంటే మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయగలరు. ఒకవేళ మీరు ‘Nobody’ అని సెలెక్ట్ చేసుకుంటే... మీ అనుమతి ఉంటే తప్ప మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయలేరు. ఇందుకోసం గ్రూప్ అడ్మిన్ తమ వాట్సప్ గ్రూప్‌లో చేరాలంటూ మీకు గ్రూప్ ఇన్విటేషన్ పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ 72 గంటలు మాత్రమే యాక్టీవ్‌గా ఉంటుంది. మీరు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్ అడ్మిన్ మిమ్మల్ని తన గ్రూప్‌లో యాడ్ చేయడానికి అవకాశముంటుంది.
Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్
ఇవి కూడా చదవండి:
Personal Finance: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?