WHATSAPP FROM FACEBOOK TO REPLACE WITH WHATSAPP FROM META IN MOBILE APP SS GH
WhatsApp: ఫేస్బుక్ పేరు మెటాగా మార్పు... మరి వాట్సప్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది?
WhatsApp: ఫేస్బుక్ పేరు మెటాగా మార్పు... మరి వాట్సప్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది?
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp | ఫేస్బుక్ పేరు 'మెటా'గా మారిన సంగతి తెలిసిందే. కేవలం మాతృసంస్థ (Parent Company) పేరు మాత్రమే మెటాగా మారింది. మరి ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి.
ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ పేరు 'మెటా'గా (Meta) మారిపోయిన విషయం తెలిసిందే. కేవలం ఈ సంస్థ కంపెనీ పేరు మారింది కానీ దాని అనుబంధ సంస్థలైన ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్ పేర్లు మారలేదు. అయితే మెటాగా ఫేస్బుక్ కంపెనీ పేరు మారిన తరువాత తాము ఎలాంటి మార్పులు చూస్తామోనని వాట్సాప్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లుక్స్వైజ్ గా కాస్త మారే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆండ్రాయిడ్‌లోని ఓ బీటా వెర్షన్ యాప్‌లో స్ప్లాష్ స్క్రీన్ పై "వాట్సాప్ ఫ్రమ్ ఫేస్బుక్"కి బదులు "వాట్సాప్ ఫ్రమ్ మెటా (WhatsApp from Meta)" అనే సరికొత్త మార్పు కనిపించిందని WABetaInfo నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం మనం మన వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్ట్ స్క్రీన్ దిగువన 'వాట్సాప్ ఫ్రమ్ ఫేస్బుక్' అనే ఒక బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది. అయితే వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ WABetaInfo రిపోర్ట్ ప్రకారం, అది ఇప్పుడు మారబోతోంది. మెటా బ్రాండ్ లోగోతో పాటు వాట్సాప్ ఫ్రమ్ మెటా అనే మార్పు లేటెస్ట్ బీటా యాప్‌లో కనిపించడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రస్తుతానికైతే ఈ చేంజ్ బీటా యాప్‌లో తప్ప మిగతా వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రాలేదు. నిజానికి కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే ఈ చేంజ్ అనేది కనిపిస్తోంది. కాగా వారం క్రితం వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ట్వీట్ చేస్తూ, రాబోయే వారాల్లో వాట్సాప్ యాప్‌లు, వెబ్సైట్ రెండింటిలోనూ మెటా బ్రాండింగ్ కనిపించనుందని పేర్కొన్నారు.
త్వరలోనే స్టేబుల్ వాట్సాప్ వెర్షన్లో మెటా బ్రాండ్ నేమ్ అప్డేట్ రావచ్చని WABetaInfo కూడా తెలిపింది. బ్రాండ్ నేమ్ మారినప్పటికీ కొత్తగా ఎలాంటి మార్పులు వాట్సాప్ లో రాకపోవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫేస్బుక్ లో మాత్రం కాలక్రమేణా మెటావర్స్ సేవలు అందుబాటులోకి రావచ్చు.
ప్రస్తుత స్టేబుల్ వెర్షన్ యాప్‌లో సెట్టింగ్స్ పేజీలో దిగువ భాగాన "Whatsapp from Facebook" అని కనిపిస్తుంది. అయితే లేటెస్ట్ బీటా యాప్‌లో ఈ లేబుల్(label) మిస్ అయిందని WABetaInfo వెల్లడించింది. కొన్ని ఐఓఎస్ బీటా టెస్టర్లు కూడా ఇప్పుడు "వాట్సాప్ ఫ్రమ్ మెటా" అనే లేబుల్ స్ప్లాష్ స్క్రీన్‌పై చూడగలరని నివేదిక పేర్కొంది.
కొందరు ఐఓఎస్ యూజర్లు స్ప్లాష్ స్క్రీన్ కనిపించని టెక్నికల్ ఇష్యూ గమనించే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి బీటా అప్డేట్లో సమస్య పరిష్కరించే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో నివేదించింది. ఈ మార్పు రాబోయే వారాల్లో ఆండ్రాయిడ్ లోని వాట్సాప్ బీటాకు కూడా వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటుండగా.. యూజర్లు ఎగ్జైట్ అవుతున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.