WhatsApp: వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గాయి... ఎందుకంటే

WhatsApp | ఇటీవల వాట్సప్ ఫార్వర్డ్ లిమిట్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఫార్వర్డ్ మెసేజెస్ భారీగా తగ్గిపోయాయి.

news18-telugu
Updated: April 28, 2020, 1:31 PM IST
WhatsApp: వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గాయి... ఎందుకంటే
WhatsApp: వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గాయి... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్‌లో గ్రూప్స్‌లో ఫార్వర్డ్ మెసేజెస్ నాన్‌స్టాప్‌గా వస్తుంటాయి. వచ్చిన మేసెజ్‌లే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అంతేకాదు... ఎక్కువగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుండటం కూడా తలనొప్పిగా మారింది. అందుకే పదేపదే సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్‌కు ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ లేబుల్ తీసుకొచ్చింది వాట్సప్. అయినా ఫార్వర్డ్ మెసేజెస్ తగ్గలేదు. ఆ తర్వాత ఫార్వర్డ్ లిమిట్‌ను ఐదుగురికి తగ్గించింది వాట్సప్. దీంతో ఫార్వర్డ్ మెసేజెస్ కాస్త తగ్గాయి. 25 శాతం వరకు ఫార్వర్డ్ మెసేజెస్ తగ్గినట్టు పాత లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో వాట్సప్‌లో తప్పుడు సమాచారం ఎక్కువగా షేర్ అవుతోంది. దీంతో ఫార్వర్డ్ లిమిట్‌ను ఒకరికి మాత్రమే తగ్గించింది వాట్సప్. దీంతో ఫ్రీక్వెంట్లీ ఫార్వెర్డెడ్ మెసేజెస్ భారీగా తగ్గిపోయాయి. ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గినట్టు వాట్సప్ అధికారికంగా వెల్లడించింది.

వైరల్ మెసేజెస్ సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. కొత్త లిమిట్ పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్ మెసేజెస్ పంపించడం 70 శాతం తగ్గింది. దీని వల్ల పర్సనల్, ప్రైవేట్ మెసేజెస్ పంపడానికి వాట్సప్ వేదికగా మారింది.

వాట్సప్ ప్రతినిధి


కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా కోట్లాది మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడలేకపోతున్నారు. వాట్సప్ సమాచారంపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారం వైరల్‌గా మారే అవకాశముంది. అందుకే వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ లిమిట్ తగ్గించింది. అంతేకాదు బల్క్, ఆటోమేటెడ్ మెసేజెస్ పంపేందుకు ప్రయత్నించిన 20 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసింది.

ఇవి కూడా చదవండి:

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

Paytm: పేటీఎంతో మీరూ డబ్బులు సంపాదించొచ్చు... ఎలాగంటే 

మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా
First published: April 28, 2020, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading