హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఆ పని ఇక మరింత సులభం

WhatsApp: వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఆ పని ఇక మరింత సులభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Whatsapp: వాట్సాప్ యూజర్లు మీడియా ఫైల్స్‌ను క్యాప్షన్ టెక్స్ట్‌తో సెండ్, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కొత్త క్యాప్షన్ వ్యూ తో, మీరు చాట్స్‌కు ఫార్వర్డ్ చేసిన కొత్త మెసేజ్‌, మీడియాకు క్యాప్షన్ ఉందో లేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WhatsApp: అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ (Whatsapp).. యూజర్ల అభిరుచులకు తగ్గట్టు నిరంతరం అప్‌డేట్ అవుతుంటుంది. ప్రతి నెలా కొత్త ఫీచర్‌(Whatsapp new Feature)ను పరిచేయం చేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్.. క్యాప్షన్ పేరుతో కొత్త అప్‌డేట్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. కొంత మంది బీటా టెస్టర్లకు వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా (Whatsapp Desktop Beta)పై ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇమేజస్, వీడియోస్, GIFs, డాక్యుమెంట్స్ వంటి వాటిని క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇండియన్‌ మార్కెట్‌లోకి కొత్త డెస్క్‌టాప్స్..ఆసుస్ AIO A3202,A3402లాంచ్..ధర,

దీనికి సంబంధించి వాట్సాప్ ట్రాకర్ WABetaInfo ఒక స్క్రీన్‌షాట్‌ షేర్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. యూజర్లు ఫోటో, వీడియో, GIF, డాక్యుమెంట్స్‌ను ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. కొత్త క్యాప్షన్ వ్యూ కనిపిస్తుంది. దీని సాయంతో యూజర్లు మీడియా ఫైల్స్‌ను క్యాప్షన్ టెక్స్ట్‌తో సెండ్, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కొత్త క్యాప్షన్ వ్యూ తో, మీరు చాట్స్‌కు ఫార్వర్డ్ చేసిన కొత్త మెసేజ్‌, మీడియాకు క్యాప్షన్ ఉందో లేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్ క్యాప్షన్‌ రిమూవ్ బటన్‌ను కూడా బీటాలో అందిస్తోంది. దీన్ని ట్యాప్ చేసి, క్యాప్షన్‌ను రిమూవ్ చేయవచ్చు. దీంతో మీడియా ఫైల్స్ ఫార్వర్డ్ చేయడంపై యూజర్లకు కంట్రోల్ ఉంటుంది.

iPhone 14: ఐఫోన్ 14పై అమెజాన్‌లో బంపరాఫర్... డిస్కౌంట్ల వివరాలు ఇవే

* iOS బీటాలో కూడా..

WABetaInfo రిపోర్ట్ ప్రకారం.. ఫార్వర్డింగ్ ప్రక్రియలో భాగంగా ఇమేజస్, వీడియోస్, GIFs డాక్యుమెంట్స్‌కు క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. iOS 22.23.0.72 వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన యూజర్లు కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్స్‌కు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా 2.2245.5 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన వారు క్యాప్షన్‌తో మీడియా ఫైల్స్ ఫార్వర్డ్ చేసే ఫీచర్‌ వాడుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

మరోవైపు, యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు iOS, Androidలో అందరికీ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లో ఉపయోగించవచ్చు. WhatsApp పోల్స్ ఫీచర్ ద్వారా ఆన్సర్స్‌గా గరిష్టంగా 12 ఆప్షన్స్‌తో పోల్‌ను క్రియేట్ చేయడానికి యూజర్లకు అవకాశం ఉంటుంది. ఆన్సర్స్‌గా అందుబాటులో ఉన్న ఆప్షన్స్‌లో ఏదానికైనా ఓటు వేయవచ్చు. ఒక వ్యక్తి ఒకటి లేదా అన్ని ఆప్షన్‌లకు ఓటు వేయవచ్చు. ఈ ఫీచర్ గతంలో గ్రూప్ చాట్స్‌లో వర్క్ చేస్తుండగా, ఇప్పుడు పర్సనల్ చాట్స్‌లో కూడా వర్క్ చేయనుంది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Technology, Whatsapp

ఉత్తమ కథలు