హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mozilla Firefox: వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

Mozilla Firefox: వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

Mozilla Firefox: వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

Mozilla Firefox: వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

Mozilla Firefox: వాట్సాప్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు హ్యాకర్లకు టార్గెట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్. యూజరలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మొబైల్స్‌ (Mobiles), ఇంటర్నెట్‌ (Internet) వినియోగం చాలా రెట్లు పెరిగింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ (Online Banking), డిజిటల్‌ పేమెంట్స్‌ ట్రాన్సాక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో డిజిటల్‌ డివైజెస్‌ లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లలో లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు దాడులు చేస్తున్నారు. పాస్‌వర్డ్‌లు, ఇతర డేటాను దొంగిలించి బ్యాంక్‌ అకౌంట్స్‌లో నగదు మాయం చేస్తున్నారు. సున్నితమైన వివరాలను బహిర్గతం చేస్తామని యూజర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా వాట్సాప్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు హ్యాకర్లకు టార్గెట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్.

* వాట్సాప్‌ యూజర్లు టార్గెట్‌ అయ్యే అవకాశం

హ్యాకింగ్, సైబర్ దాడుల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ (CERT-In) పని చేస్తోంది. ఇంటర్నెట్‌ స్పేస్‌లో ప్రమాదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సైబర్‌ దాడులకు గురికాకుడా ఉండేందుకు సలహాలు, సూచనలు అందిస్తోంది.

తాజాగా వాట్సాప్ యాప్‌ వినియోగిస్తున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. వాట్సాప్‌లో మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని, హ్యాకర్స్‌కు టార్గెట్‌ మారడంలో సహాయపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాట్సాప్‌లోని వల్నరబిలిటీస్‌ ఆర్బిటరీ కోడ్స్‌ను రన్‌ చేయడానికి అటాకర్‌కు ఉపయోగపడుతాయని, ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని CERT-In పేర్కొంది.

* మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి

మొజిల్లా ఫైర్‌ఫాక్స్(Mozilla Firefox) బ్రౌజర్‌లో కూడా మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ తెలిపింది. ఈ లోపాలను వినియోగించుకుని హ్యాక్‌ చేయడానికి వీలుగా రూపొందించిన వెబ్‌సైట్‌ను హ్యాకర్స్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉందని నోడల్ ఏజెన్సీ తెలిపింది. ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడానికి వినియోగదారులు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ని 105కి, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ESRని వెర్షన్ 102.3కి అప్‌డేట్ చేయాలని సూచించింది.

ఇది కూడా చదవండి : సిమ్ కార్డ్, OTT సేవల కోసం ఫేక్‌ డీటైల్స్‌ ఇస్తే ఏడాది జైలు శిక్ష.. కొత్త రూల్స్ ఇవే..

బ్రౌజర్ ఇంజిన్‌లోని మెమరీ సేఫ్టీ బగ్‌లు, తాత్కాలిక పేజీలపై బైపాస్ ఆఫ్ ఫీచర్ పాలసీ రెస్ట్రిక్షన్స్‌, థ్రెడ్‌లలో నాన్-UTF-8 URLలను అన్వయించేటప్పుడు డేటా రేస్, కుకీస్ హోస్ట్, సెక్యూర్‌ ప్రిఫిక్స్, గ్రాఫిక్స్‌ ఇనిషలైజింగ్‌ చేసేటప్పుడు స్టాక్‌ ఓవర్‌ఫ్లో, కంటెంట్‌ సెక్యూరిటీ పాలసీ బేస్‌-uri బైపాస్‌, ARM64పై WAS బిల్డ్‌ చేస్తున్నప్పుడు ఇన్‌కొహెరెంట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ క్యాష్‌ వంటివి మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో వల్నరబిలిటీస్‌కు కారణమయ్యాయని తెలిపింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Cyber Attack, Tech news, Whatsapp

ఉత్తమ కథలు