WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఇక ఆ అనుమానాలకు చెక్..

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్(WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం తాజాగా చాట్ బ్యాక్-అప్స్ కోసం కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు బ్యాకప్స్ కోసం ఎన్‌క్రిప్షన్(Enscription) లేకపోవడం వల్ల డేటా సెక్యూరిటీ(Data Security)పై అనుమానాలు తలెత్తేవి. దీంతో దీనికి సంబంధించిన కొత్త ఫీచర్‌(New Feature)ను సంస్థ అభివృద్ధి చేసింది.

  • Share this:
వాట్సాప్(WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం తాజాగా చాట్ బ్యాక్-అప్స్ కోసం కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు బ్యాకప్స్ కోసం ఎన్‌క్రిప్షన్(Enscription) లేకపోవడం వల్ల డేటా సెక్యూరిటీ(Data Security)పై అనుమానాలు తలెత్తేవి. దీంతో దీనికి సంబంధించిన కొత్త ఫీచర్‌(New Feature)ను సంస్థ అభివృద్ధి చేసింది. చాట్ బ్యాక్-అప్స్(BackUps) కోసం ఈ స్థాయి సెక్యూరిటీని అందించే ఏకైక ప్లాట్‌ఫాం తమదేనని వాట్సాప్ పేర్కొంది. ఇప్పుడు మెసేజ్‌లు పంపడం, రిసీవ్ అయ్యే క్రమంలో ట్రాన్సిట్‌లో ఉండటం, ఆ తరువాత క్లౌడ్‌లో స్టోర్ చేయడం.. వంటి ప్రతి సందర్భంలో ఎండ్‌- టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుందని సంస్థ వెల్లడించింది.

స్నేహితుల పుట్టినరోజును గుర్తు చేసే అద్భుతమైన ఫీచర్​ వచ్చేసింది.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి..


కొత్త ఫీచర్ ఎలా అందుబాటులోకి వస్తుంది?
వాట్సాప్ ముందు టెక్నికల్ కమ్యూనిటీకి ఈ ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఆ తరువాత బీటా టెస్టర్లకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇది ఒక ఆప్షనల్ ఫీచర్‌గా విడుదల అవ్వనుంది. రానున్న రోజుల్లో దీన్ని వాట్సాప్ iOS, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ ప్రకటించింది.

WhatsApp Tricks: వాట్సాప్‌లో ఎవరైనా మీ కాంటాక్ట్ నంబర్ బ్లాక్ చేశారని అనుమానంగా ఉందా.. అయితే ఈ ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి..


ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం డేటా బ్యాకప్ కోసం వాట్సాప్... యాపిల్, గూగుల్ క్లౌడ్ పార్ట్నర్స్‌తో కలిపి పనిచేస్తోంది. యాపిల్ ఐ-క్లౌడ్ లేదా గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ డేటాను స్టోర్ చేస్తోంది. అయితే క్లౌడ్ లోకి అప్‌లోడ్ చేయడానికి ముందే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో బ్యాకప్‌లకు రక్షణ అందించే సామర్థ్యాన్ని వాట్సాప్ అందించనుంది. ఇందుకు HSM (హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్) బేస్డ్ బ్యాకప్ కీ వాల్ట్‌ను సృష్టించింది.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు.. క్లౌడ్‌లో బ్యాకప్‌లను స్టోర్ చేయడానికి ముందే క్లయింట్ చాట్ మెసేజ్‌లను, టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు వంటి డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. యూజర్ డివైజ్‌లో జనరేట్ అయ్యే ఒక ర్యాండమ్‌ కీని ఉపయోగించి ఈ డేటా బ్యాకప్ అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ రాకముందు ఐక్లౌడ్, డ్రైవ్‌లో స్టోర్ చేసిన బ్యాకప్‌ డేటాకు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షణ ఉండదు.

WhatsApp New Trick: ఇక నుంచి వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడొచ్చు.. దాని కోసం ఇలా చేయండి..


కీ ఎక్కడ స్టోర్ అవుతుంది?
వినియోగదారులు పెట్టుకునే పాస్‌వర్డ్‌తో బ్యాకప్‌ ఎన్‌క్రిప్షన్ కీ స్టోర్ అవుతుంది. ఈ పాస్‌వర్డ్‌ను వాట్సాప్‌ లేదా మొబైల్ డివైజ్ క్లౌడ్ పార్టనర్స్, థర్డ్ పార్టీ సర్వీస్‌లు సేకరించలేవు. ఇది HSM బ్యాకప్ కీ వాల్ట్‌లో స్టోర్ అవుతుంది. డివైజ్‌ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు HSM బ్యాకప్ కీ వాల్ట్‌ ద్వారా కీని పొందవచ్చు.
Published by:Veera Babu
First published: