హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: కేంద్రంపై వాట్సాప్‌ అసంతృప్తి.. సుప్రీంకోర్టులో పిటిషన్.. కొత్త నిబంధనలు అలా ఉన్నాయంటూ..

WhatsApp: కేంద్రంపై వాట్సాప్‌ అసంతృప్తి.. సుప్రీంకోర్టులో పిటిషన్.. కొత్త నిబంధనలు అలా ఉన్నాయంటూ..

ఇంటర్‌నెట్ మాయజాలంలో మరో వ్యక్తి బలయ్యాడు.  ఉద్యోగం కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తున్నవారికి 

కమీషన్‌ల పేర సైబర్ నేరగాళ్లు వల విసిరారు. అధిక మొత్తం డబ్బులు ఇస్తామంటూ ముందుగా ఆశచూపి 

దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఉదంతం మరోకటి వెలుగు చూసింది.

ఇంటర్‌నెట్ మాయజాలంలో మరో వ్యక్తి బలయ్యాడు. ఉద్యోగం కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తున్నవారికి కమీషన్‌ల పేర సైబర్ నేరగాళ్లు వల విసిరారు. అధిక మొత్తం డబ్బులు ఇస్తామంటూ ముందుగా ఆశచూపి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఉదంతం మరోకటి వెలుగు చూసింది.

భారత్‌లో బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సోషల్ మీడియా నిబంధనల వల్ల ప్రైవసీ ప్రొటెక్షన్‌ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ చెబు?

మెస్సేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హై కోర్టులో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సోషల్ మీడియా నిబంధనల వల్ల ప్రైవసీ ప్రొటెక్షన్‌ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ చెబుతోంది. అందువల్ల తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనలను ఆపేయాలని కోరుతూ భారత ప్రభుత్వంపై వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ వివరాలను రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. కొత్త నిబంధనలలో ఒకటి భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించాలని హైకోర్టును వాట్సాప్ కోరింది. సోషల్ మీడియా కంపెనీలు కంటెంట్‌ క్రియేటర్లను గుర్తించాల్సిన అవసరం ఉందనే నిబంధనను వాట్సాప్ ఎత్తిచూపుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. తాము అడిగినప్పుడు ఈ సమాచారాన్ని అందివ్వాలని సోషల్ మీడియా కంపెనీలను అధికారులు డిమాండ్ చేస్తారని, ఇది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వాట్సాప్ ఫిర్యాదులో పేర్కొంది.

తప్పు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వినియోగదారుల వివరాలను మాత్రమే అందివ్వాలని చట్టం చెబుతోంది. అయితే ఆచరణలో ఇది ఒక్కటే చేయటం సాధ్యం కాదని వాట్సాప్ పేర్కొంది. ఎందుకంటే మెస్సేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. ఇందులో కంటెంట్ పంపిన వారితో (ఆరిజినేటర్స్) పాటు, రిసీవర్ల ఎన్క్రిప్షన్‌ను కూడా భాగంగా ఉంటుంది. అందువల్ల ఆరిజినేటర్స్ వివరాలతో పాటు రిసీవర్ల ఎన్‌క్రిప్షన్‌ను కూడా బ్రేక్ చేయాల్సి వస్తుందని వాట్సాప్ చెబుతోంది. అయితే ఈ విషయంపై వాట్సాప్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్ నిర్ధారించలేదు. ఈ విషయంపై స్పందించడానికి వాట్సాప్ ప్రతినిధులు సైతం నిరాకరించారు.

* మూడు నెలల క్రితమే ఆదేశాలు

సోషల్ మీడియా కంపెనీలు అమలు చేయాల్సిన కొత్త నిబంధనలపై కేంద్రం మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. వీటిపై స్పందించడానికి గడువు మంగళవారంతో ముగిసింది. భారత్‌లో కోవిడ్-19పై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, సంక్షోభంపై ప్రభుత్వ స్పందనను పనిగట్టుకొని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న విమర్శలను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు తొలగించాలని ప్రభుత్వం టెక్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది.

ఈ క్రమంలోనే.. కరోనా సమయంలో కాంగ్రెస్ ప్రణాళిక ప్రకారం ఆందోళనలు చేపట్టేందుకు ఒక టూల్ కిట్‌ను రూపొందించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఇటీవల ఆరోపించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌ను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ట్విట్టర్ ‘మానిప్యులేటెడ్ మీడియా’ అనే ట్యాగ్‌ను జోడించింది. ట్వీట్‌లో నకిలీ కంటెంట్ ఉందనే అర్థం వచ్చేలా ఈ ట్యాగ్‌ను ట్విట్టర్ జోడించింది. ఈ టూల్ కిట్ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న పోరులో ట్విట్టర్ కీలకంగా మారింది. దీనిపై బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వాట్సాప్ ఆఫీస్‌కు వెళ్లి నోటీసులు అందించారు. ఈ క్రమంలో వాట్సాప్ ఫిర్యాదు వ్యవహారం బయటకు రావడం గమనార్హం.

* కొత్త మార్గదర్శకాలు ఏవి?

కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌, ఇతర నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసే నకిలీ, రెచ్చగొట్టే కంటెంట్, రాజకీయ లబ్ధి కోసం వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కంపెనీలు నిరోధించాలి. గతంలో ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసి, వ్యాపింపజేసే వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకునేది. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, కంపెనీలకు "మధ్యవర్తుల" హోదా ఉండదు. అంటే నకిలీ సమాచారాన్ని వ్యాపించజేయడంలో సంస్థ కూడా భాగమైనట్లు అధికారులు భావించి, చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది. గతంలో కంపెనీలకు ఉన్న చట్టపరమైన రక్షణ ఇకమీదట ఉండదు.

* సోషల్ మీడియా కంపెనీల స్పందన ఎలా ఉంది?

భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌తో పాటు దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్, ఇతర టెక్ కంపెనీలు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయితే భారత ప్రభుత్వం ఈ సంస్థలపై ఎక్కువ నియంత్రణ ఉండాలని భావించడం తమకు ఇబ్బందికరంగా మారుతోందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. కంపెనీల భారత విభాగంలోని కీలక బాధ్యతల్లో భారతీయులను నియమించడం, ఏదైనా అంశంపై చట్టపరమైన ఉత్తర్వు వచ్చిన 36 గంటలలోపు కంటెంట్‌ను తొలగించడం, ఫిర్యాదులకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, అశ్లీల చిత్రాలను తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్‌ను వాడటం.. వంటి కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల్లో ఉన్నాయి.

వీటిని పాటించని కంపెనీలను భారత్‌లో నిషేధించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే తమ సంస్థ ఈ నిబంధనలను అంగీకరిస్తుందని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఇంకా కొన్ని అంశాలపై చర్చలు జరపాలని సంస్థ భావిస్తోంది. కానీ ప్రభుత్వంపై విమర్శకులు చేస్తున్న పోస్టులను తొలగించడంలో విఫలమైన ట్విట్టర్ మాత్రం, దీనిపై స్పందించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ వ్యాజ్యం ప్రాధాన్యం సంతరించుకుంది.

* చట్టబద్ధత లేదంటున్న వాట్సాప్

భారత సుప్రీంకోర్టు గతంలో పుట్టాస్వామి కేసులో, వ్యక్తుల ప్రైవసీకి మద్దతుగా తీర్పు ఇచ్చింది. 2017లో వెల్లడించిన ఈ తీర్పును వాట్సాప్ ఫిర్యాదులో పేర్కొందని, పిటిషన్ గురించి తెలిసినవారు చెబుతున్నారు. కొన్ని అత్యవసర చట్టపరమైన సందర్భాల్లో మినహాయించి, వ్యక్తుల గోప్యతకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొంది. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయని వాట్సాప్ చెబుతోంది. దీంతో పాటు వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదని, పార్లమెంటు చేసిన చట్టాల్లో ఇవి లేవని ఆ సంస్థ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కొందరు నిపుణులు కూడా వాట్సాప్ వాదనకు మద్దతు ఇస్తున్నారు. కంటెంట్ ఆరిజినేటర్ వివరాలు వెల్లడించాలనే నిబంధన వల్ల భారత్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సేవలకు ముగింపు పలకవచ్చని చెబుతున్నారు స్టాన్‌ఫోర్డ్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ నిపుణులు రియానా పిఫెర్‌కార్న్. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలకు సంబంధించిన ఇతర పిటిషన్లు ఢిల్లీ, ఇతర కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ కొత్త కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Supreme Court, Whatsapp

ఉత్తమ కథలు