హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Whatsapp : నేటి నుంచి ఈ ఫోన్‌లో వాట్స‌ప్ ప‌ని చేయ‌దు.. మీ ఫోన్ ఇందులో ఉందా?

Whatsapp : నేటి నుంచి ఈ ఫోన్‌లో వాట్స‌ప్ ప‌ని చేయ‌దు.. మీ ఫోన్ ఇందులో ఉందా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Whatsapp : ఎప్పుడూ కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆశ్చ‌ర్య ప‌ర‌చ‌డం వాట్స‌ప్‌కు స‌హ‌జం. ఇటు ఆండ్రాయిడ్(Android), అటు iOS వినియోగ‌దారుకు కొత్త ఫీచ‌ర్ల‌ను అందించే వాట్స‌ప్ షాకింగ్ న్యూస్ తెలిపింది. ప‌లు మోడ‌ళ్ల‌లో న‌వంబ‌ర్ 1, 2021 నుంచి వాట్స‌ప్(whatsapp) ప‌ని చేయ‌ద‌ని పేర్కొంది.

ఇంకా చదవండి ...

కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ (Features)తో వినియోగ‌దారుల‌ను ఆశ్చ‌ర్య ప‌ర‌చ‌డం వాట్స‌ప్‌ (Whatsapp)కు స‌హ‌జం. ఇటు ఆండ్రాయిడ్ (Android), అటు iOS వినియోగ‌దారుకు కొత్త ఫీచ‌ర్ల‌ను అందించే వాట్స‌ప్ షాకింగ్ న్యూస్ తెలిపింది. ప‌లు మోడ‌ళ్ల‌లో న‌వంబ‌ర్ 1, 2021 నుంచి వాట్స‌ప్ ప‌ని చేయ‌ద‌ని పేర్కొంది. ఆ రోజు నుంచి ఆయా మోడ‌ళ్ల స్మార్ట్ ఫోన్‌ (Smart Phone)ల‌లో వాట్స‌ప్ ప‌నిచేయ‌దు. ఐఫోన్ కోసం iOS 9 కంటే సమానమైన లేదా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) ఉన్నవారు మరియు ఆండ్రాయిడ్ 4.0.3 కంటే తక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ ఇక పని చేయదు. ఇందుకు వాట్స‌ప్ కార‌ణం తెలిపింది. ఈ ఫోన్ మోడ‌లళ్ల‌లో కొత్త ఫీచ‌ర్ అప్‌డేట్ చేయ‌డానికి వ‌ర్ష‌న్ స‌పోర్టు చేయ‌ద‌ని అందుకే వీటిలో ఇక వాట్స‌ప్ ప‌ని చేయ‌ద‌ని తెలిపింది.

వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని అందుకోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు వాట్స‌ప్ తెలిపింది.

JioPhone Next: దీపావళి నుంచి జియో ఫోన్​ నెక్ట్స్​ అమ్మకాలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే?


ఇక‌పై వాట్సాప్ వయోగించాలి అంటే, ఆండ్రాయిడ్ OS 4.1 లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లను లేదా iOS 10 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న ఐఫోన్‌లను యూజర్లు ఎంచుకోవాలని సిఫార్సు చేసారు.

న‌వంబ‌ర్ 1, 2021 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల లిస్ట్..

LG బ్రాండ్ ఫోన్‌లు ఇవే..

LG Lucid 2,Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD and 4X HD, Optimus F3Q , Optimus F7, Optimus F5, Optimus L3 II Dual, Optimus L7 II, Optimus F6, Enact , Optimus L4 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, ఫోన్‌ల‌లో వాట్స‌ప్ ప‌ని చేయ‌దు.

ఐఫోన్‌లో వాట్స‌ప్ ఆగిపోయే మోడ‌ళ్లు - Phone SE, 6S మరియు 6S Plus

శామ్‌సంగ్‌లో..

Galaxy SII, Galaxy S3 mini, Galaxy Ace 2, Samsung Galaxy Trend Lite,Galaxy Xcover 2, Galaxy Core, Galaxy Trend II ఇందులో వాట్స‌ప్ రాదు.

సోనీ (Sony) ఫోన్‌లు.. Sony Xperia Neo L, Sony Xperia Miro, Xperia Arc S

హువావే ఫోన్‌లు ఇవే..

Huawei Ascend G740, Ascend D1 Quad XL, Ascend P1 S, Ascend Mate, Ascend D Quad XL, Ascend D2. వీటితో పాటుLenovo A820, HTC Desire 500, Alcatel One Touch Evo 7, Archos 53 Platinum, Faea F1, Caterpillar Cat B15, Wiko Cink Five, Wiko Darknight, UMi X2, THL W8 , ZTE Grand S Flex, ZTE V956, Grand Memo, Grand X Quad V987. ఫోన్లకు కూడా ఈ నవంబర్ తో వాట్సాప్ ప‌నిచేయ‌దు. దీంతో ఈ మోడ‌ళ్లు వాడే వారు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక త‌ప్ప‌దు.

First published:

Tags: Android, Smart phone, Whatsapp

ఉత్తమ కథలు