WhatsApp ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ ఛాట్ బ్యాకప్స్ ఫీచర్​ లాంచ్.. యూజర్ల డేటా మరింత సురక్షితం

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుత తరంలో వాట్సాప్ గురించి ప్రతి ఒక్కరికి సూపరిచితమే. మెసేజింగ్ సదుపాయంతో పాటు ఇటీవలే పేమెంట్ ఫీచర్ ను కూడా ఈ ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ప్రవేశపెట్టింది. వినియోగదారుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను లాంచ్ చేస్తూనే ఉంది.

  • Share this:
ప్రస్తుత తరంలో వాట్సాప్ (WhatsApp) గురించి ప్రతి ఒక్కరికి సూపరిచితమే. మెసేజింగ్ సదుపాయంతో పాటు ఇటీవలే పేమెంట్ ఫీచర్ ను కూడా ఈ ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ప్రవేశపెట్టింది. వినియోగదారుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ (WhatsApp) ఛాట్ బ్యాకప్ అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. అయితే,త్వరలో వాట్సాప్ (WhatsApp) ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చాట్ బ్యాకప్స్ తీసుకురానున్నట్లు గత నెలలోనే ప్రకటించింది. తాజాగా వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ బ్యాకప్ ఛాట్ గూగుల్ డ్రైవ్, యాపిల్ ఐక్లౌడ్ లో భద్రపరుచుకోవచ్చని స్పష్టం చేసింది.

WhatsApp Features: త్వరలోనే వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్లు.. ఇక ప్రత్యర్థి యాప్స్​కు చుక్కలే..


వాట్సాప్ హెడ్.. విల్ క్యాథ్ కార్ట్ ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. "మా బీటా వెర్షన్ ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఇప్పుడు దీన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నాం. నిదానంగా ప్రారంభిస్తాం. ప్రజలకు బ్యాకప్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. వాటిని సరిగ్గా తీసుకోవాలి. వీలైనంత త్వరగా అందరికీ అందించడానికి మేము కృషి చేస్తాం." అని ఆయన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. మీరు సెండ్ చేస్తున్న లేదా స్వీకరిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చేసిన మెసేజులు మీ డివైజుల్లో స్టోర్ చేస్తుంటే ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఫోన్ లు పోగుట్టుకుంటున్న చాలా మంది వారి ఛాట్స్ ను బ్యాకప్ చేయడానికి నూతన మార్గాల కోసం అన్వేషిస్తున్నారని, గూగుల్ డ్రైవ్ లేదా యాపిల్ ఐక్లౌడ్ లో ఎండ్-ఎండ్- ఎన్ క్రిప్ట్ ఛాట్స్ స్టోర్ చేయడానికి ఇది అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

64 డిజిట్​ ఎన్​క్రిప్టెట్​ కీతో డేటా మరింత భద్రం..
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ బ్యాకప్ ఆప్షన్ ద్వారా మెసేజులను తమకు నచ్చిన పాస్వర్డ్ లేదా 64-డిజిట్ ఎన్ క్రిప్షన్ 'కీ'తో భద్రపరచుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. "వాట్సాప్ లేదా మీ బ్యాకప్ సర్వీస్ ప్రొవైడర్ మీ ఛాట్స్ ను చదవలేరు" అని స్పష్టం చేసింది. దీని ప్రకారం వినియోగదారులు 64-డిజిట్ ఎన్ క్రిప్షన్ కోల్పోతే తమ ఛాట్ బ్యాకప్ ను కూడా కోల్పోతారని అర్థం చేసుకోవాలి.

ఈ నూతన ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత యాప్స్ కు లేటెస్ట్ వెర్షన్ అని వాట్సాప్ తెలిపింది. ఎన్ క్రిప్టెడ్ బ్యాకప్ ఆప్షన్ ను నిదానంగా విడుదల చేయడం ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. కాబట్టి ఈ అప్డేట్ మీరు ఇంకా చేసుకోనట్లయితే భయపడాల్సిన పనిలేదని, రెండు వారాల్లో పొందాల్సి ఉంటుందని పేర్కొంది.
Published by:Krishna Adithya
First published: