WHATSAPP DOWN FOR AROUND AN HOUR USERS REQUESTS TESLA CHIEF ELON MUSK TO BUY THIS MESSAGING APP SS
WhatsApp Down: సార్... వాట్సప్‌ని కొనేయండి ప్లీజ్... యాప్ డౌన్ కావడంతో ఎలాన్ మస్క్‌కు యూజర్ల రిక్వెస్ట్
WhatsApp Down: సార్... వాట్సప్‌ని కొనేయండి ప్లీజ్... యాప్ డౌన్ కావడంతో ఎలాన్ మస్క్‌కు యూజర్ల రిక్వెస్ట్
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Down | ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఓ గంట పాటు వాట్సప్ సరిగ్గా పనిచేయలేదు. వాట్సప్ డౌన్ (Whatsapp Down) కావడంతో ఈ యాప్‌ను కొనేయండి అంటూ ఎలాన్ మస్క్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు యూజర్లు.
పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ డౌన్ (WhatsApp Down) అయింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు వాట్సప్ ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 29 శుక్రవారం నాడు వాట్సప్‌లో సమస్యలు కనిపించాయి. సుమారు ఓ గంట పాటు వాట్సప్ యాప్ పనిచేయలేదు. యూజర్లు ఛాట్ చేయలేకపోయారు. వీడియో కాల్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సప్ డౌన్ అయిందంటూ యూజర్లు ట్విట్టర్లో (Twitter) ట్వీట్స్ చేశారు. తమ వాట్సప్ అకౌంట్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిందని, వాట్సప్ ఉపయోగించలేకపోతున్నామని, ఛాట్స్ చేయలేకపోతున్నామని ట్విట్టర్లో పోస్ట్స్ చేశారు.
వెబ్‌సైట్స్, యాప్స్‌లో వచ్చే సమస్యల్ని పరిశీలించే డౌన్ డిటెక్టర్ సమాచారం ప్రకారం 64 శాతం మంది యూజర్లు మెసేజెస్ పంపలేకపోతున్నారని, 19 శాతం మంది యాప్ ఉపయోగించలేకపోతున్నారని, 17శాతం మంది మెసేజెస్ రిసీవ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు రిపోర్ట్ చేసినట్టు తేలింది.
దీంతో వాట్సప్ కూడా ట్విట్టర్లో స్పందించింది. "మీరు ప్రస్తుతం వాట్సప్‌ని ఉపయోగించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మేము ఈ విషయాన్ని గుర్తించాం. మళ్లీ యాప్ సజావుగా పనిచేసేలా కృషి చేస్తున్నాము. వివరాలను అప్డేట్ చేస్తాము. మీ సహనానికి ధన్యవాదాలు" అంటూ వాట్సప్ ట్వీట్ చేసింది.
You may be experiencing some issues using WhatsApp at the moment. We’re aware and working to get things running smoothly again. We’ll keep you updated and in the meantime, thanks for your patience.
అరగంటలోనే సమస్యను పరిష్కరించింది వాట్సప్. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా యూజర్లకు తెలిపింది. అయితే వాట్సప్‌లో సమస్యలు తలెత్తడంతో ఈ మెసేజింగ్ యాప్‌ను కొనేయండి ప్లీజ్ అంటూ యూజర్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను రిక్వెస్ట్ చేయడం విశేషం. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు... కోకా కోలా కంపెనీని కూడా కొనేస్తానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
Realme GT 2: రియల్మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్
వాట్సప్ యాప్ డౌన్ కావడంతో ఈ మెసేజింగ్ యాప్‌ని కొనేయండి ప్లీజ్ అంటూ ట్వీట్స్ చేయడం చర్చనీయాంశమవుతుంది. వాట్సప్‌కి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వారిలో 48 కోట్లకు పైగా యూజర్లు భారతదేశంలోనే ఉండటం విశేషం. గతంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయం అయిన వాట్సప్ ఆ తర్వాత అనేక సర్వీసుల్ని అందించడం ప్రారంభించింది. వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఆడియో ఫైల్స్ షేర్ చేయొచ్చు. ఇండియాలో కొంతకాలం క్రితం వాట్సప్ పేమెంట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.