వాట్సాప్ డౌన్... యూజర్లకు తిప్పలు... వెల్లువెత్తిన ఫిర్యాదులు..

వాట్సప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయింది.

news18-telugu
Updated: January 19, 2020, 7:13 PM IST
వాట్సాప్ డౌన్... యూజర్లకు తిప్పలు... వెల్లువెత్తిన ఫిర్యాదులు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయింది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి పంపినా అవి అవతలి వారికి చేరలేదు. ఎన్ని సార్లు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాట్సప్ సరిగా పనిచేయడం లేదంటూ చాలా మంది యూజర్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేశారు. సుమారు గంటపాటు వాట్సప్ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. చాలా మంది యూజర్లు ఫిర్యాదులు చేయడంతో ప్రస్తుతం #whatsappdown అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. దీని మీద సోషల్ మీడియాలో చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాట్సప్ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన తర్వాత దాని యాజమాన్య సంస్థ ఫేస్ బుక్ ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.



Published by: Ashok Kumar Bonepalli
First published: January 19, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading