Home /News /technology /

WHATSAPP DISAPPEARING MESSAGES CAN NOW BE MADE DEFAULT FOR ALL CHATS JNK GH

WhatsApp: వాట్సాప్​లో కొత్త ఫీచర్​.. డిసప్పియరింగ్​ సమయాన్ని 9‌‌0 రోజులకు సెట్ చేసుకునే అవకాశం

వాట్సప్‌లో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌లు అదృశ్యం అవడానికి 90 రోజుల సమయం

వాట్సప్‌లో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌లు అదృశ్యం అవడానికి 90 రోజుల సమయం

WhatsApp: వాట్సాప్​ ఇటీవల తీసుకొచ్చిన డిసప్పియరింగ్ ఫీచర్​లో ఓ కొత్త అప్​డేట్​ను చేర్చింది. ఈ డిసప్పియరింగ్ మెసేజెస్​ ఫీచర్​ను మరో రెండు మోడ్​లలో అందుబాటులోకి తెచ్చింది.

మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) రోజుకో కొత్త ఫీచర్​ (New Feature) జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తమ యూజర్లు (Users) చేజారిపోకుండా.. కొత్త యూజర్లను ఆకర్షించేలా నూతన ఫీచర్లను ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా వాట్సాప్​ ఇటీవల తీసుకొచ్చిన డిసప్పియరింగ్ ఫీచర్​లో ఓ కొత్త అప్​డేట్​ను చేర్చింది. ఈ డిసప్పియరింగ్ మెసేజెస్​ ఫీచర్​ను మరో రెండు మోడ్​లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​లో మొదటి మోడ్​ ఆన్​ చేసుకుంటే వాట్సాప్​ ఛాటింగ్​, మెసేజ్​లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్​గా డిలీట్​ అవుతాయి. ఇక, రెండో ఆప్షన్​ తీసుకుంటే 90 రోజుల తర్వాత మీ వాట్సాప్​ మెసేజ్​లు డిసప్పియర్​​ అవుతాయి. కాగా, వాట్సాప్​లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీచర్​ ప్రకారం, వాట్సాప్​ చాటింగ్ 7 రోజుల తర్వాత ఆటోమేటిక్​గా డిలీట్​ అవుతుంది. అయితే, ఇప్పుడు వీటికి అదనంగా మరో రెండు టైమ్​ పీరియడ్స్​లో మెసేజ్​లు వాటంతట అవే ఆటోమేటిక్​గా డిలీట్​ అయ్యే ఫీచర్​ను తీసుకొచ్చింది.

ఫీచర్​ ఎలా పనిచేస్తుంది?

మీరు ఇతరులకు మెసేజ్​ పంపే సమయంలో డిసప్పియరింగ్ మెసేజ్​ ఫీచర్​ను ఆన్​ చేసుకొని టైమ్​ సెట్​ చేసుకోవచ్చు. ఆ చాటింగ్​ 24 గంటల్లో డిలీట్​ అయిపోవాలా? లేక 7 రోజుల్లో డిలీట్​ అయిపోవాలా? లేక 90 రోజులా అనేది నిర్ణయించుకొని ఈ ఫీచర్​ను అప్లై చేయాల్సి ఉంటుంది. కొత్తగా క్రియేట్ చేసే వాట్సాప్​ గ్రూప్​లకు సైతం ఈ ఫీచర్​ను ఉపయోగించుకోవచ్చని వాట్సాప్​ తెలిపింది. దీని ద్వారా చాటింగ్ హిస్టరీని ఆటోమేటిక్​గా డిలీట్​ చేసుకునే సౌకర్యాన్ని యూజర్లకు కల్పించింది. అయితే, ఇప్పటివరకూ చేసిన చాటింగ్ డిలీట్ అయిపోతుందేమోనన్న సందేహం మీకు అక్కర్లేదు. కేవలం మీరు ఎంచుకున్న చాటింగ్​కు మాత్రమే డిసప్పియరింగ్ మెసేజెస్​ ఫీచర్​ వర్తిస్తుందని వాట్సాప్​ తెలిపింది.

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సేల్ మొదలైంది... నోట్ 10టీ కన్నా బెటరా?


వాట్సాప్​ గ్రూప్స్​కు సైతం..

వాట్సాప్​ గతేడాది ఈ ఫీచర్​ను టెక్ట్స్​ మెసేజెస్​కు మాత్రమే వర్తింపజేసింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలకు సైతం ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. అయితే, టెక్ట్స్​ మెసేజ్​ల తరహాలో కాకుండా వ్యూ వన్స్​ అనే ఫీచర్​ను ఫోటోలు, వీడియోల కోసం తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ను మీరు అప్లై చేసుకున్నట్లైతే చాటింగ్​లోని ఫోటో, వీడియో మీకు ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు. ఆపై అవి కనిపించవు. కాగా, ఇటీవల ఫ్లాష్​ కాల్​, మెసేజ్​ లెవల్​ రిపోర్టింగ్​ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్​ మరికొన్ని ఫీచర్లపై ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగా ఈ డిసప్పియరింగ్ ఫీచర్​లో టూ మోడ్స్​ను తీసుకొచ్చింది. కాగా, ఈ కొత్త ఫీచర్​ను ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఐఓఎస్​ యూజర్లు సైతం అందుబాటులోకి రానుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Meta, New feature, Whatsapp

తదుపరి వార్తలు