WhatsApp Dictation: చెప్తే చాలు... వాట్సప్‌ మెసేజ్ టైప్ అయిపోతుంది

WhatsApp Dictation | డిక్టేషన్ ఫీచర్ వాడుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కీబోర్డ్ పైన ఉన్న మైక్‌ ఐకాన్ పైన క్లిక్ చేసి మెసేజ్ చెప్పాలి. మెసేజ్ టైప్ కాగానే సెండ్ చేయాలి. అయితే గూగుల్ అసిస్టెంట్, సిరి లాంటి స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్స్ ద్వారా డిక్టేషన్ ఫీచర్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: January 17, 2019, 5:17 PM IST
WhatsApp Dictation: చెప్తే చాలు... వాట్సప్‌ మెసేజ్ టైప్ అయిపోతుంది
నమూనా చిత్రం
  • Share this:
వాట్సప్... ప్రపంచమంతా తెలిసిన మెసేజింగ్ సర్వీస్. అసలు వాట్సప్ ఉద్దేశం, లక్ష్యం సందేశాలను చేరవేయడమే. మెసేజ్ టైప్ చేస్తే చాలు క్షణాల్లో అవతలివారికి చేరిపోతుంది. అంతేకాదు... ఫోటోలు, ఎమోజీలు, గిఫ్, స్టిక్కర్లు, వీడియోలు... ఇలా అనేక ఫీచర్లు వాట్సప్‌లో ఉన్నాయి. అవే కాదు... థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సప్‌ని ఇంకా బాగా వాడుకోవచ్చు. వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ కూడా అలాంటిదే. దీన్నే డిక్టేషన్ ఫీచర్ అని కూడా అంటారు. మెసేజ్‌ టైప్ చేసి పంపించడం అందరికీ ప్రస్తుతం ఉన్న అలవాటు. ఇకపై టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టైప్ చేయాలనుకున్న మెసేజ్‌ని చెప్తే చాలు. ఛాట్ విండోలో ఆటోమెటిక్‌గా టైప్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్

డిక్టేషన్ ఫీచర్ వాడుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కీబోర్డ్ పైన ఉన్న మైక్‌ ఐకాన్ పైన క్లిక్ చేసి మెసేజ్ చెప్పాలి. మెసేజ్ టైప్ కాగానే సెండ్ చేయాలి. అయితే గూగుల్ అసిస్టెంట్, సిరి లాంటి స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్స్ ద్వారా డిక్టేషన్ ఫీచర్ వాడుకోవచ్చు. యాప్ స్టోర్‌లో కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉన్నాయి. ఒక్క ఇంగ్లీష్ మాత్రమే కాదు... మీరు ఏ భాషలో అయినా వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ వాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

మీరు డిక్టేషన్ ఫీచర్ వాడుకోవలంటే ముందుగా వాట్సప్ ఓపెన్ చేయాలి. మీరు ఎవరికి మెసేజ్ పంపాలో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కీబోర్డ్ ఓపెన్ చేసి మైక్ ఐకాన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పేవన్నీ ఛాట్ విండోలో టైప్ అవుతాయి కానీ కామా, క్వశ్చన్ మార్క్, కొటేషన్ లాంటి పంక్చువేషన్ మార్క్స్(విరామ చిహ్నాలు) టైప్ కావు. వాక్యం ఫుల్ స్టాప్‌తో పూర్తవుతుంది. మీరు మెసేజ్ డిక్టేట్ చేయడం పూర్తైన తర్వాత సెండ్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అయితే మెసేజ్ పంపే ముందు తప్పులు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. తప్పులు ఉంటే సరిదిద్ది పంపొచ్చు. ఈ ఫీచర్ వాట్సప్‌లో మాత్రమే కాదు...  మిగతా యాప్స్‌లోనూ వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499

SBI CARD: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
Published by: Santhosh Kumar S
First published: January 17, 2019, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading