దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) గతేడాది ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేసింది. ఈ సంవత్సరంలో కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరిన్ని ఫీచర్లను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. వాట్సప్ బీటా ఇన్ఫో (WABetaInfo) లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ డిసప్పియరింగ్ మెసేజ్ (Disappearing Message)లను టెంపరరీగా సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉంది. సాధారణంగా ఏదైనా వాట్సప్ చాట్‌కు 'డిసప్పియరింగ్ మెసేజెస్' టర్న్ ఆన్ చేస్తే.. ఆ చాట్‌లోని మెసేజ్‌లన్నీ ఒక పర్టికులర్ టైమ్ తర్వాత డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసినా ఆ చాట్‌లోని మెసేజెస్ సేవ్ చేసుకునేలా వాట్సప్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.
డిసప్పియరింగ్ మెసేజెస్‌ను సేవ్ చేసే ఫీచర్‌ను 'కెప్ట్ మెసేజెస్ (Kept Message)'గా వాట్సప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ చేసింది. కెప్ట్ మెసేజెస్ లేదా సేవ్డ్ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగించి చాట్‌లోని డిసప్పియరింగ్ మెసేజెస్‌ను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. అంటే ఇలా సేవ్ చేసిన డిసప్పియరింగ్ మెసేజ్‌లు చాట్ నుంచి ఆటోమేటిక్‌గా ఎప్పటికీ డిలీట్ అవ్వవు. చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని చూడగలరు. యూజర్లు ఈ మెసేజ్‌లు అవసరం లేదనుకుంటే వాటిని ఏ సమయంలోనైనా "అన్-కీప్" చేయవచ్చు. అప్పుడు ఆ మెసేజ్‌లు చాట్ నుంచి పర్మనెంట్‌గా డిసప్పియర్ అవుతాయి. ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు.
Poco C50: కాసేపట్లో పోకో సీ50 సేల్... ధర రూ.7,000 లోపే
WABetaInfo తన లేటెస్ట్ రిపోర్ట్‌లో ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో వాట్సప్‌లో కెప్ట్ మెసేజెస్‌తో సేవ్ చేసిన ఒక మెసేజ్ చూడవచ్చు. అలానే డిసప్పియరింగ్ మెసేజ్ బబుల్‌లో కనిపించే బుక్‌మార్క్ ఐకాన్ గమనించవచ్చు. చాట్‌లో కనిపించే ఈ విజువల్ ఇండికేటర్ సహాయంతో డిసప్పియరింగ్ మెసేజ్‌లు, సేవ్ చేసిన మెసేజ్‌ల మధ్య తేడాను గుర్తించడం సాధ్యమవుతుంది.
యూజర్లు సెట్ చేసుకున్న టైమ్ లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా ఈ సేవ్డ్ మెసేజ్‌లు కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చాట్‌లోని ఎవరైనా సరే డిలీట్ చేయవచ్చు. వాట్సప్‌లో స్టార్‌డ్ మెసేజెస్‌పై స్టార్ గుర్తు ఎలా ఉంటుందో అలా ఈ సేవ్డ్ లేదా కెప్ట్ మెసేజ్‌పై కూడా ఒక గుర్తు ఉంటుంది. వీటిని కావలసినప్పుడు అన్‌సేవ్ చేయడం ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి డిలీట్ చేస్తే మళ్లీ తిరిగి పొందడం సాధ్యం కాదు. డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసినా వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌లను సేవ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది.
EMI Offer: రూ.500 లోపు ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం... ఆఫర్ వివరాలు తెలుసుకోండి
వాట్సప్ QR కోడ్‌ని ఉపయోగించి ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్‌పై కూడా పనిచేస్తోందని WABetaInfo నివేదించింది. అలానే వాట్సప్ రీసెంట్‌గా తన యూజర్లకు “యాక్సిడెంటల్ డిలీట్” పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మీరు పొరపాటున "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"కి బదులుగా "డిలీట్ ఫర్ మీ" ఆప్షన్‌ని నొక్కితే.. ఆ యాక్షన్ క్యాన్సిల్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనివల్ల యూజర్లకు చాలా హెల్ప్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartphone, Whatsapp, Whatsapp tricks