పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) రోజుకో కొత్త ఫీచర్‌ను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ వాటికి మార్పులు చేర్పులు చేస్తూ యూజర్ బేస్ పెంచుకుంటోంది. ఇందులో భాగంగా వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్' ఆప్షన్ టైమ్‌ను పెంచనుంది. వాట్సాప్‌లో సెండ్ చేసిన మెసేజ్(Message) అవతలి వ్యక్తికి కనిపించకుండా డిలీట్(Delete) చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రస్తుతం దీని టైమ్ లిమిట్ 1 గంట 8 నిమిషాల 16 సెకన్లు మాత్రమే ఉండగా.. దీన్ని 2 రోజుల 12 గంటలకు పొడిగించాలని వాట్సాప్ యోచిస్తోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన రెండు రోజుల తర్వాత కూడా చాట్ నుంచి డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మెసేజ్ డిలీట్ అయిన తర్వాత ‘దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్’ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.410 యూజర్లకు టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) పేర్కొంది.
WhatsApp is readying message reactions (secured by end-to-end encryption) in a new upcoming update of WhatsApp beta for Android and iOS. ?❤️???? pic.twitter.com/o9CMW6pnsN
— WABetaInfo (@WABetaInfo) February 2, 2022
త్వరలోనే యూజర్లందరికీ కమ్యూనిటీ ఫీచర్..
కాగా, వాట్సాప్ గ్రూప్స్‌కు భిన్నంగా కమ్యూనిటీస్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాట్సాప్ గతేడాది వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మిన్లు వేర్వేరు గ్రూపులను ఒక చోటుకు చేర్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గ్రూప్ అడ్మిన్‌కి మరిన్ని అదనపు ఆప్షన్లను జోడిస్తుంది. ఒక కమ్యూనిటీలో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు చాట్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
కమ్యూనిటీస్‌కు అడ్మిన్‌గా ఉన్నవారు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూప్స్‌లోకి కూడా మెసేజ్‌లను సెండ్ చేయవచ్చు. గ్రూప్స్‌లో మాదిరిగానే కమ్యూనిటీ అడ్మిన్లు ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ లేదా మాన్యువల్ విధానంలో కమ్యూనిటీల్లోకి ఆహ్వానించవచ్చు. అయితే కమ్యూనిటిలోకి వచ్చిన కొత్త వ్యక్తి మాత్రం అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌లను పంపలేరు. కమ్యూనిటీ మెంబర్స్ ఇతర మెంబర్స్‌తో సంభాషిచవచ్చా? లేదా? అనేది కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp