పాపులర్ మెసేజింగ్ యాప్ (Messaging App) వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను (New Features) పరిచయం చేస్తుంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫీచర్లలో మార్పులు చేర్పులు చేస్తూ వాటిని మరింత ఉపయోగకరంగా మారుస్తుంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌కు ఓ కొత్త మార్పును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది వాట్సాప్. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (DELETE FOR EVERYONE) ఫీచర్‌కు కొత్త టైం లిమిట్ చేర్చనుంది. ప్రస్తుతానికైతే, యూజర్లు ఒక గంట 8 నిమిషాల 16 సెకండ్ల క్రితం పంపించిన ఓల్డ్ మెసేజ్‌లను మాత్రమే అందరికీ డిలీట్ (delete for everyone) చేయగలరు. కానీ కొత్తగా వస్తున్న మార్పుతో 7 రోజుల 8 నిమిషాల లోపు పంపిన మెసేజ్‌ను కూడా డిలీట్ చేసుకోవచ్చు. దీని అర్థం వారం రోజుల క్రితం పంపిన మెసేజ్‌లను కూడా మీ చాట్‌తో (Chat) సహా పంపిన వ్యక్తుల చాట్ నుంచి కూడా డిలీట్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ యూజర్లకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఆల్రెడీ సెండ్ చేసిన లేదా పాత మెసేజ్‌లకు టైం లిమిట్‌ను పొడగించాలని వాట్సాప్ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌లో కొత్త మార్పు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగ దశలో ఉన్న ఈ కొత్త మార్పు త్వరలోనే లేటెస్ట్ యాప్ అప్‌డేట్‌తో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టైం లిమిట్ అప్‌డేట్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి అధికారికంగా విడుదల కాకముందు ఈ అప్‌డేట్ గురించి డెవలపర్లు తమ ప్లాన్ మార్చుకునే అవకాశం ఉందని వాట్సాప్ బీటాఇన్ఫో (WABetaInfo) తెలిపింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు గానీ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా యూజర్లకు గానీ అందుబాటులో లేదు. ఇది మొదటగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నిత్యం బోలెడన్ని సరికొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోన్న వాట్సాప్ వాటిని బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెస్తోంది. బీటా టెస్టర్లకు రీసెంట్‌గా కస్టమ్ ప్రైవసీ ఆప్షన్.. వాయిస్ మెసేజ్ రికార్డింగ్స్‌లో పాజ్ అండ్ రెస్యూమ్ ఆప్షన్ పరిచయం చేసింది. వారి కోసం ఇంకా మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చింది. అవేంటో తెలుసుకుంటే..
* అన్నోన్ బిజినెస్ అకౌంట్స్
తెలియని వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నుంచి మీ వాట్సాప్‌కు మెసేజ్ వస్తే.. వాట్సాప్ మిమ్మల్ని వెంటనే అలర్ట్ చేస్తుంది. "థిస్ బిజినెస్ అకౌంట్ ఇస్ నాట్ ఇన్ యువర్ కాంటాక్ట్స్" అని ఒక నోటిఫికేషన్‌ను చాట్ కింద చూపిస్తుంది. ఈ నోటిఫికేషన్‌లో బ్లాక్ కాంటాక్ట్ లేదా యాడ్ టు కాంటాక్ట్స్ అనే రెండు ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. వీటి సహాయంతో మీరు ఈజీగా బ్లాక్ లేదా యాడ్ చేయవచ్చు. నిజానికి ఈ ఫీచర్ కొత్తదేం కాదు. అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత దాని కిందనే "థిస్ సెండర్ ఇస్ నాట్ యువర్ లిస్ట్" అని వాట్సాప్ గతం నుంచే ఒక మెసేజ్ చూపిస్తుంది. కానీ ఇప్పుడా మెసేజ్ చాట్ పైభాగంలో కాకుండా కిందిభాగంలో మరింత స్పష్టంగా కనిపించనుంది.
* హెచ్‌డీ, బెస్ట్ క్వాలిటీ ఫోటోలు
ఇప్పుడు ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లు హెచ్‌డీ, బెస్ట్ క్వాలిటీ ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే ఫీచర్‌పై పని చేస్తోన్న వాట్సాప్ అందరికీ త్వరలోనే పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో ఫొటోలు షేర్ చేయడానికి ముందు బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్ మోడ్, ఆటో మోడ్ ఆప్షన్స్ పొందుతారు యూజర్లు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New feature, Whatsapp, Whatsapp tricks