గుడ్ న్యూస్: ఇక వాట్సప్‌లోనూ డార్క్ మోడ్

కొన్ని నెలలుగా డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు చేస్తోంది వాట్సప్. ఈ నెలాఖరులో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో యూజర్లకు డార్క్ మోడ్ ఆప్షన్ అందించనుంది. డార్క్‌మోడ్‌తో చీకట్లో కళ్లను కాపాడుకోవడం మాత్రమే కాదు... బ్యాటరీ కూడా ఆదా చేసుకోవచ్చు.

news18-telugu
Updated: December 6, 2018, 5:11 PM IST
గుడ్ న్యూస్: ఇక వాట్సప్‌లోనూ డార్క్ మోడ్
image: REUTERS/Dado Ruvic
  • Share this:
వాట్సప్... ప్రపంచంలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. కోట్లాది మంది యూజర్లున్న వాట్సప్‌... తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. వాట్సప్‌లో ఫీచర్లు మారినా... ఇంటర్‌ఫేస్‌లో పెద్దగా మార్పులు రాలేదు. కానీ ఇక మీ వాట్సప్‌ కొత్తగా కనిపించబోతుంది. యూజర్లు కావాలనుకుంటే డార్క్ మోడ్ ట్రై చేయొచ్చు. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ రాబోతోంది.

ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్ లాంటి అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. ఇన్నాళ్లూ వాట్సప్‌లో ఆ లోటు ఉండేది. అయితే కొన్ని నెలలుగా డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు చేస్తోంది వాట్సప్. ఈ నెలాఖరులో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో యూజర్లకు డార్క్ మోడ్ ఆప్షన్ అందించనుంది. డార్క్‌మోడ్‌తో చీకట్లో కళ్లను కాపాడుకోవడం మాత్రమే కాదు... బ్యాటరీ కూడా ఆదా చేసుకోవచ్చు.

ఈ ఏడాదిలో యూజర్లకు చాలా ఫీచర్లు ఇచ్చింది వాట్సప్. అనేక మార్పులు తీసుకొచ్చి యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు డార్క్ మోడ్‌తో పాటు మరిన్ని ఫీచర్లపై కసరత్తు చేస్తోంది. అయితే ఇంకా భవిష్యత్తులో చాలా మార్పులతో వాట్సప్ కొత్తగా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి:వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

వాట్సప్‌లో కొత్త ఫీచర్... మీకు సమస్యలు తప్పవా?

వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్స్ ఎలా వాడాలో తెలుసా?వాట్సప్‌లో కొత్తగా మరో రెండు ఫీచర్లు

వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్

ఫేక్‌న్యూస్‌పై పోరాటం: టీవీల్లో వాట్సప్ యాడ్స్
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>