WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది

WhatsApp Dark Mode | డార్క్‌ మోడ్‌తో వాట్సప్‌కు కొత్త లుక్ రావడమే కాదు... బ్యాటరీ సేవ్ చేయొచ్చు. రాత్రి సమయంలో యాప్ ఉపయోగిస్తే కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది. త్వరలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

news18-telugu
Updated: January 24, 2019, 6:03 PM IST
WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది
WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది
  • Share this:
వాట్సప్ గతేడాది అనేక ఫీచర్లను యూజర్లకు రిలీజ్ చేసింది. ఈ ఏడాది కూడా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అలాంటి ఫీచర్లలో ఒకటి డార్క్ మోడ్. ఇప్పటికే చాలా యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. వాట్సప్ కూడా డార్క్ మోడ్ ఫీచర్‍ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. బ్లాక్/గ్రే థీమ్‌తో వాట్సప్ డార్క్ మోడ్ ఉంటుందని అంచనా. వాట్సప్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ముందుగానే ప్రపంచానికి తెలియజేసే WABetaInfo కూడా వాట్సప్‌లో డార్క్ మోడ్ త్వరలో రాబోతోందని చెప్పడం విశేషం. అంతేకాదు వాట్సప్ డార్క్ మోడ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది.


డార్క్‌ మోడ్‌తో వాట్సప్‌కు కొత్త లుక్ రావడమే కాదు... బ్యాటరీ సేవ్ చేయొచ్చు. రాత్రి సమయంలో యాప్ ఉపయోగిస్తే కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది. త్వరలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క వాట్సప్ మాత్రమే కాదు గూగుల్ కూడా తమ యాప్స్‌లో డార్క్ మోడ్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్, మెసేజెస్, క్రోమ్ లాంటివాటిలో డార్క్ మోడ్ ఉంది. గూగుల్ అసిస్టెంట్‌కు డార్క్ మోడ్ రానుంది.
ఇవి కూడా చదవండి:

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

Honor View 20: భారీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో హానర్ వీ20... పూర్తి వివరాలివే

Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

 
First published: January 24, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading