WHATSAPP CONSUMING MORE BATTERY IN ANDROID SMARTPHONES KNOW WHY SS
WhatsApp: వాట్సప్‌తో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతోందా? నిజమిదే
WhatsApp: వాట్సప్‌తో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతోందా? నిజమిదే
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Battery Drain | వాట్సప్ అప్డేట్ చేసిన తర్వాత గతంతో పోలిస్తే ఎక్కువ బ్యాటరీ ఉపయోగించుకుంటుందన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. కొందరైతే వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేస్తున్నారు.
మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఇటీవల త్వరగా ఖాళీ అవుతోందా? గతంలో ఉన్నట్టుగా ఛార్జింగ్ ఉండట్లేదా? అసలు సమస్య ఏంటో అని తెలియక అయోమయంగా ఉన్నారా? మీ వాట్సప్ కావచ్చు. అవును... వాట్సప్ లేటెస్ట్ వర్షన్‌తో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందన్న చర్చ జరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వాట్సప్ అప్డేటెడ్ వర్షన్ ఉన్న యూజర్ల ఫోన్లల్లో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై యూజర్లు వన్‌ప్లస్ ఫోరమ్, గూగుల్ ప్లే స్టోర్, ట్విట్టర్, రెడ్డిట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సప్ అప్డేట్ కారణంగా బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందని వన్‌ప్లస్ 7టీ ప్రో, వన్‌ప్లస్ 7టీ, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు మిగతా యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు.
వాట్సప్ 2.19.308 వర్షన్ ఉన్న యూజర్లందరికీ దాదాపుగా ఇదే సమస్య. రోజుకు 5 నిమిషాలు వాట్సప్ వాడితేనే 16% బ్యాటరీ ఖర్చయిపోతోందని ఒకరు కంప్లైంట్ చేస్తే, 33% బ్యాటరీ అయిపోతోందని ఇంకొకరు ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సప్ యాప్‌ను 2.19.308 వర్షన్‌కు అప్డేట్ చేసిన తర్వాత గతంతో పోలిస్తే ఎక్కువ బ్యాటరీ ఉపయోగించుకుంటుందన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. కొందరైతే వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేస్తున్నారు. వన్‌ప్లస్, గూగుల్ పిక్సెల్, హువావే, షావోమీ, సాంసంగ్ ఫోన్లు వాడేవారి నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే దీనిపై వాట్సప్ ఇంకా స్పందించలేదు.
Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.