వాట్సప్ కొత్త ఫీచర్‌తో మీకు షాకే!

వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌తో కొందరికి ఇబ్బందులు తప్పవు. ఏవైనా మెసేజెస్ ఫార్వర్డ్ చేయాలంటే ఐదుగురి కంటే ఎక్కువ పంపలేరు.

news18-telugu
Updated: August 9, 2018, 10:59 AM IST
వాట్సప్ కొత్త ఫీచర్‌తో మీకు షాకే!
వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌తో కొందరికి ఇబ్బందులు తప్పవు. ఏవైనా మెసేజెస్ ఫార్వర్డ్ చేయాలంటే ఐదుగురి కంటే ఎక్కువ పంపలేరు.
  • Share this:
ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు వాట్సప్ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతకముందు ఫార్వర్డ్ మెసేజెస్‌కు 'ఫార్వర్డెడ్' లేబుల్ ప్రవేశపెట్టిన వాట్సప్... ఇప్పుడు ఐదుగురి కంటే ఎక్కువ మందికి పోస్ట్ షేర్ చేసుకోకుండా లిమిట్ పెట్టింది. కొత్త వర్షన్‌‌లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఫేస్‌న్యూస్‌తో పాటు రెచ్చగొట్టే కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతుండటంతో వాట్సప్ వైఫల్యాన్ని ఎత్తిచూపింది భారతదేశ ప్రభుత్వం. దీంతో వాట్సప్ ఇలాంటి చర్యలు తీసుకుంటోంది.

భారతదేశంలోని 20 కోట్ల మంది వాట్సప్ యూజర్లకు ఆగస్ట్ 8 నుంచే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫార్వర్డ్ చేసే వాట్సప్ మెసేజ్‌ల లిమిట్‌ను ఐదుకు మాత్రమే పరిమితం ఫీచర్‌ని ఇండియాలో ప్రవేశపెట్టేందుకు పరీక్షిస్తున్నామని గతనెలలో ప్రకటించింది ఆ కంపెనీ. యూజర్లను ఎడ్యుకేట్ చేయడానికి కొత్త వీడియోను పోస్ట్ చేసిన వాట్సప్... ఫేక్‌న్యూస్ ఎలా గుర్తించాలన్నదానిపై యూజర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. అంతేకాదు... యూజర్లు ఏవైనా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని తెలిపింది.

ఇండియాలో మెసేజెస్‌ ఫార్వర్డ్ చేసే లిమిట్ ఐదుగురికే ఉన్నా... ఇతర దేశాల్లో 20 మందికి ఫార్వర్డ్ చేయొచ్చు. "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా యూజర్లకు సేఫ్టీ, ప్రైవసీ అందిస్తున్నాం. ఇలాంటి ఫీచర్లను మరిన్ని పెంచుతాం" అని వాట్సప్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Published by: Santhosh Kumar S
First published: August 9, 2018, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading